మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘సరిలేరు నీకెవ్వరు’…!

  • February 29, 2020 / 04:37 PM IST

50 రోజులకి 100 రోజులకి ఎప్పుడో కాలం చెల్లిపోయిన తరుణంలో … కొందరి పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే ఆ ఫీట్ సాధ్యమవుతుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఆ విషయంలో చెప్పుకోదగ్గ రికార్డుని సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే… జనవరి 11న సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 29(ఈరోజు) తో 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో 117.40 కోట్ల షేర్ ను నమోదు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 138.68 కోట్ల షేర్ ను రాబట్టింది.

గ్రాస్ పరంగా చూసుకుంటే.. 222.20 కోట్లను కొల్ల గొట్టింది. ఇక 50 రోజుల సెంటర్స్ విషయానికి వస్తే… 61 డైరెక్ట్ సెంటర్స్ కాగా… మరో 52 షిఫ్ట్ సెంటర్స్ లో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోనుంది. మొత్తంగా 50 రోజులు 113 కేంద్రాల్లో నడిచింది. ఇప్పటికీ కొన్ని మాస్ సెంటర్స్ లో ఈ చిత్రం వో మోస్తరుగా కలెక్ట్ చేస్తూనే ఉంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus