నాని (Nani) – వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్లో ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) తర్వాత రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) . డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందింది. ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య (SJ Suryah) పవర్ఫుల్ విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్స్.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది.
దీంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.భారీ వర్షాలు కలెక్షన్స్ పై ప్రభావం చూపినప్పటికీ.. మొత్తంగా పర్వాలేదు అనిపించింది.ఒకసారి (Saripodhaa Sanivaaram Collections) ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 10.46 cr |
సీడెడ్ | 2.99 cr |
ఉత్తరాంధ్ర | 2.75 cr |
ఈస్ట్ | 1.22 cr |
వెస్ట్ | 0.95 cr |
గుంటూరు | 1.34 cr |
కృష్ణా | 1.35 cr |
నెల్లూరు | 0.86 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 21.92 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.18 Cr |
ఓవర్సీస్ | 10.85 Cr |
మిగిలిన భాషలు | 0.96 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 36.91 cr |
‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram Collections) చిత్రానికి రూ.44.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం ఈ సినిమా రూ.36.91 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.8.09 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.