Sarkaru Vaari Paata Collections: ఆ తప్పు జరగకుండా ఉంటే ఈ వీకెండ్ కూడా కుమ్మేది..!

Advertisement

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలై 23 రోజులు పూర్తి చేసుకుంది. సగం ఓటీటీ రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేస్తుండడం విశేషం. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి.మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను ముటకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ పర్వాలేదు అనిపించింది.

23 వ రోజున కూడా ఈ మూవీ స్టడీ గా రాణించింది. ఒకసారి ‘సర్కారు వారి పాట’ 23 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 34.92 cr
సీడెడ్ 12.08 cr
ఉత్తరాంధ్ర 12.48 cr
ఈస్ట్  8.94 cr
వెస్ట్  5.64 cr
గుంటూరు  8.60 cr
కృష్ణా  6.30 cr
నెల్లూరు  3.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 92.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   6.95 cr
ఓవర్సీస్  12.70 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 112.31 cr

‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 23 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.112.31 కోట్ల షేర్ ను రాబట్టింది. నెగిటివ్ టాక్ తో ఇలా కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.8.69 కోట్ల షేర్ ను రాబట్టాలి.అది అసాధ్యమే. అయితే చాలా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది.

చాలా మంది పైరసీ సైట్స్ నుండీ డౌన్లోడ్ చేసుకుని చూడటం కూడా జరుగుతుంది. అయితే 23వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.10 లక్షల షేర్ ను వసూల్ చేయడం విశేషం. బహుశా కొత్త పాటని జోడించడం వల్ల అయ్యుండొచ్చు. ఓటీటీ వెర్షన్ లో మాత్రం ఈ పాట లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీకెండ్ కూడా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 140కి పైగా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది.రెంట్ పద్ధతిలో ఓటిటి రిలీజ్ చేయకుండా ఉంటే ఈ వీకెండ్ కూడా ఈ మూవీ క్యాష్ చేసుకునేది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news