Sarkaru Vaari Paata Collections: 25వ రోజున కూడా ఇలా కలెక్ట్ చేస్తుందని ఊహించి ఉండరు..!

Advertisement

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలై 25 రోజులు పూర్తి చేసుకుంది. సగం ఓటీటీ రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేస్తుండడం విశేషం. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి.మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను ముటకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ పర్వాలేదు అనిపించింది.

25 వ రోజున ఆదివారం అయినప్పటికీ ఈ మూవీ ఓకె అనేలా కలెక్ట్ చేసింది. ఒకసారి ‘సర్కారు వారి పాట’ 25 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 34.98 cr
సీడెడ్ 12.12 cr
ఉత్తరాంధ్ర 12.52 cr
ఈస్ట్  8.96 cr
వెస్ట్  5.65 cr
గుంటూరు  8.60 cr
కృష్ణా  6.32 cr
నెల్లూరు  3.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 92.85 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   6.98 cr
ఓవర్సీస్  12.72 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 112.55 cr

‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 25 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.112.55 కోట్ల షేర్ ను రాబట్టింది. నెగిటివ్ టాక్ తో ఇలా కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.8.45 కోట్ల షేర్ ను రాబట్టాలి.

అది అసాధ్యమే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రెంట్ పద్ధతిలో అందుబాటులోకి రాకపోయి ఉంటే… ఇంకా బాగా కలెక్ట్ చేసి ఉండేది. అయినప్పటికీ 25వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.10 లక్షల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది.కొన్ని కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news