Mahesh Babu: సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న మహేష్!

  • October 25, 2021 / 12:01 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే సడెన్ గా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో సంక్రాంతికి రావాలనుకున్న సినిమాలు ఆలోచనలో పడ్డాయి.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైన తరువాత రెండు, మూడు వారాల పాటు వేరే సినిమాలకు థియేటర్లు దొరక్కపోవచ్చు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’కి పోటీగా వస్తే ఆ ప్రభావం ఎక్కడ కలెక్షన్స్ మీద పడుతుందో అని ‘సర్కారు వారి పాట’ నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తేనే బెటర్ అని భావిస్తున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట.

మరి దీనిపై నిర్మాతలు క్లారిటీ ఇస్తారేమో చూడాలి. నిజంగానే సినిమా వాయిదా పడితే మాత్రం సంక్రాంతికి మహేష్ బాబుని థియేటర్లో చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశ ఎదురైనట్లే. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకాల‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus