Oscar Awards: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్..
- March 15, 2026 / 11:49 AM ISTByFilmy Focus Desk
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకకు సర్వం సిద్ధమైంది. మన కాలమానం ప్రకారం సోమవారం వేకువజామను 4.30 నుండి 7.30 వరకు ఈ సినిమా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ వేడుకకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఒకటి చర్చలోకి వచ్చింది. నిజానికి ఇది కొత్త విషయం కాకపోయినా.. గత కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా.. ఇప్పుడు మరోసారి మాట్లాడుకుంటున్నారు. అదే సీట్ ఫిల్లర్స్. వీళ్లు ఈ ఈవెంట్‌కి ప్రత్యేక అతిథులు.. అంతేకాదు చాలా స్పెషల్ కూడా.
Oscar Awards
ఆస్కార్ అవార్డులు అలియాస్ అకాడెమీ అవార్డ్స్ నిర్వహణలో చాలా లెక్కలు ఉంటాయి. అలాగే ఈవెంట్ టీఆర్పీలు, వ్యూస్ కూడా భారీగానే ఉంటాయి. అంతమంది చూస్తారు, అంత పెద్ద ఈవెంట్ కదా అని.. ఎప్పుడూ కుర్చీలు ఖాళీగా ఉండకూడదు అని అకాడెమీ టీమ్ ఓ ప్లాన్ చేసింది. ఏ కుర్చీ ఖాళీగా ఉన్న ఒక వ్యక్తి అర్జెంటుగా వెళ్లి కూర్చుండిపోతారు. మళ్లీ ఆ సీటు కేటాయించిన వ్యక్తి వస్తే.. వారికి ప్లేస్ ఇచ్చేసి పక్కకు వెళ్లిపోతారు. వీరినే సీట్ ఫిల్లర్స్ అంటారు. అంటే ఆ సీటులోని వ్యక్తి ఏదైనా వ్యక్తిగత అవసరం కోసం వెళ్తే ఆ సీట్‌లో కూర్చుంటారన్నమాట.

ఇలా కుర్చీలు ఖాళీగా ఉండకుండా చూసుకునే ఈ పనిని పరిశ్రమలో పనిచేసేవారు, సినీ ఔత్సాహికులకు మాత్రమే ఇస్తారు. అయితే ఇలా వెళ్లేవారు కొన్ని నిబంధనలను పాటించాలట. సీట్ ఫిల్లర్స్ తమ ప్రయాణ, ఇతర వ్యక్తిగత ఖర్చులు సొంతంగా భరించాల్సి ఉంటుంది. అకాడెమీకి వీటితో ఎటువంటి సంబంధం ఉండదట. వేడుక జరుగుతున్న సమయంలో వీరు మొబైల్ ఫోన్స్ వాడకూడదట. డాల్బీ థియేటర్‌లో ప్రవేశానికి ముందే వాటిని బయట కౌంటర్‌లో ఇచ్చేయాలట.
ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మధ్యలో తినడానికి, నీళ్లు తాగడానికి సీట్ ఫిల్లర్స్‌కు అనుమతి ఉండదు. అలాగే డ్రెస్ కోడ్ తప్పనిసరి. సెలబ్రిటీలు వారంతట వారు మాట్లాడనంతవరకు సీట్ ఫిల్లర్స్ వారితో మాట్లాడకూడదట. ఇదన్నమాట ఆస్కార్‌లో అతిథులు ఎప్పుడూ ఫుల్‌గా ఉండటానికి కారణం.
అప్‌డేట్ అవ్వని అల్లు అర్జున్ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..













