బాహుబలి కంక్లూజన్ తర్వాత దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. తేజ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ లో రానా బంగారు చెవి తొడుగు ధరించడంపై ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చర్చ సాగుతోంది. ఈ కొత్త ఆభరణం వెనుక పెద్ద కథే ఉందంట. ఈ సినిమాలోని ఒక సీన్ లో జోగేంద్ర(రానా)ని శత్రువులు షూట్ చేయగా.. ఆ తూటా జోగేంద్ర చెవి మీదుగా దూసుకు వెళుతుందట. దీనితో చెవిలోని కొంత భాగం దెబ్బ తింటే, ఆ దెబ్బతిన్న భాగాన్ని బంగారపు తొడుగుతాడని తెలిసింది.
అంతేకాదు ప్రతిరోజు హీరో కు తన చెవి పై ఉన్న బంగారు తొడుగును చూడగానే తన శత్రువులను గుర్తుకు చేసుకోవాలని తేజా ఇలా కథ రాసుకున్నారని కొంతమంది చెబుతున్నారు. ఇది నిజమో కాదో.. తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా అశితోష్ రాణా, కేథరిన్ థెరిస్సా, నవదీప్, పోసాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.