రెండో పెళ్లి చేసుకున్న నటి సౌందర్య భర్త
- February 17, 2017 / 01:51 PM ISTByFilmy Focus
సౌందర్య. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరంలేని పేరు. టాలీవుడ్ లోనే కాదు.. దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నింటిలోను ఆమె హిట్ సినిమాల్లో నటించారు. హద్దుమీరని అందంతో.. ఆకట్టుకునే అభినయంతో సినీ ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అందరినీ కన్నీటి సంద్రంలో ముంచేసి 2004 ఏప్రిల్ 17 న అనంతలోకాలు వెళ్లిపోయారు. విమాన ప్రమాదంలో కన్న కూతురిని కోల్పోయిన ఆమె తల్లిదండ్రులు శోకసముద్రములో ఉంటే, సౌందర్య భర్త జి.ఎస్.రఘు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. సొందర్య సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా గడుపుతున్నట్లు బెంగళూరు మీడియా కధనాలు చెబుతున్నాయి.
గోవాకు చెందిన డాక్టర్ అర్పిత అనే ఆమెను 2010 లో రఘు పెళ్లిచేసుకున్నాడని ఆధారాలతో సహా వెల్లడించాయి. రీసెంట్ గా వీరిద్దరూ గోవాలో ఓ హోటల్లో గడిపినట్లు సమాచారం. ఈ విషయం బయటికి రావడంతో సౌందర్య తండ్రి సత్యనారాయణ విచారంలో ఉన్నట్లు తెలిసింది. తమకు చెప్పకుండా అల్లుడు రెండో పెళ్లిచేసుకోవడంపై సౌందర్య తల్లిదండ్రులు మరింత డిప్రెషన్ కి లోనయ్యారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













