కొత్తదనానికి కవర్ పేజ్….స్పైడర్!

స్పైడర్…స్పైడర్…స్పైడర్…ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే మాట…ఎక్కడ విన్నా ఇదే మాట…ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమా గురించి సగటు సామాన్యుడు ఆలోచించే విధానం కన్నా, సినిమా సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి అలాంటి స్పైడర్ అసలు ఎలా మొదలయింది? అసలు ప్రిన్స్ నే ఈ సినిమాకి ఎన్నుకోవడానికి దర్శకుడు మురుగుదాస్ ఎందుకు ఆలోచన చేశాడు? ఫక్తు కమర్షియల్ సినిమాగా కాకుండా ఈ సినిమా కొత్తదనానికి కవర్ పేజ్ గా ఎలా ఎలా మారబోతుంది? అంటే ఒకసారి ఈ కధాగమనం లోకి తొంగి చూడాల్సిందే.

స్పైడర్ అన్న కధ ఎప్పుడు మొదలయింది!ప్రిన్స్ మహేష్ బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న సమయంలోనే ఈ కధ పుట్టింది. అయితే ప్రిన్స్ బిజీగా ఉండడంతో దర్శకుడు మురుగుదాస్ ప్రిన్స్ డేట్స్ కోసం వెయిట్ చేసి ప్రిన్స్ టైమ్ దొరికాక కధ చెప్పాడట, కట్ చేస్తే ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ ఊపిరి పోసుకుంది.

స్పైడర్ సినిమాలో స్పెష్యాలిటీస్ ఏంటి!!ఇప్పటికే నాని లాంటి సైంటిఫిక్ థ్రిల్లర్ లో నటించిన ప్రిన్స్ మరోసారి రోబో స్పైడర్ అనే కధను స్పైడర్ తో మనకు అందించడం కొత్త స్పెష్యాలిటీ అయితే. ఈ సినిమాలో విలన్స్ గా మురుగుదాస్ గురువు, నాని సినిమా దర్శకుడు ఎస్.జే సూర్య నటించడం మరో విషయం. ఇక తమిళ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న యువ హీరో భరత్ సైతం ఈ సినిమాలో విలన్ గా నటించనున్నాడు. ఇక సినిమ్యాటోగ్రఫీ విషయం అయితే ఇండియన్ టాప్ ఫోటో గ్రాఫర్ సంతోష్ శివన్ చూసుకుంటున్నారు. మ్యూజిక్ వచ్చి మన హరీష్ జయరాజ్. దాదాపుగా 7ఏళ్ల తరువాత మళ్లీ హరీష్ తెలుగు సినిమా చెయ్యడం విశేషం. ఇక నిర్మాతగా ఎన్వీ ప్రసాద్ గారు వ్యవహరిస్తున్నారు. ఇక రకుల్ ప్రీత్ ప్రిన్స్ తో రొమ్యాన్స్ చేయనున్న సంగతి తెలిసిందే.

సైంటిఫిక్ థ్రిల్లర్ అంటే ఫైట్స్ విషయం ఏంటి?సినిమా పూర్తి సైంటిఫిక్ థ్రిల్లర్ అందులో డౌట్ ఏమీ లేదు. అయితే మాస్ కి నచ్చే ఫైట్స్ కు మాత్రం ఏమాత్రం కొదవ ఉండదు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ సినిమాలో యాక్షన్ మాస్టర్ గా ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ చేస్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమాలో ఫైట్స్ ఏ రేంజ్ ఉన్నాయి అంటే, 106 ఫీవర్ లో కూడా పీటర్ ఎక్కడా వెనకాడకుండా క్లైమ్యాక్స్ ఫైట్ ను చిత్రీకరించాడు. అంతెందుకు ఇప్పటికీ ఈ సినిమాలో విలన్ అయిన భరత్ ఈ సినిమాలో యాక్షన్ గురించి ఇప్పటికే ఎన్నో సార్లు మాట్లాడాడు.

సినిమా బిజినెస్ సంగతి ఏంటి?దాదాపుగా 150కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం, అదే క్రమంలో అటు తమిళ్, ఇటు తెలుగులో రెండు బాషల్లో ఈ సినిమా విడుదల అవుతూ ఉండడం. ఇక ఇప్పటికే దాదాపుగా 160కోట్ల బిజినెస్ ఈ సినిమాకి జరగడం విశేషం. తెలుగులో 92కోట్లు, తమిళ్ లో 68 కోట్ల బిజినెస్ ని ఇప్పటికే ఈ సినిమా సొంతం చేసుకుంది.

రికార్డ్స్ సంగతి ఏంటి?ఇక ఈ సినిమా రికార్డ్స్ విషయమే తీసుకుంటే సౌత్ ఇండియా లో ఈ సినిమా టీజర్ కి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు…సౌత్ లోనే మొదటి 24గంటల్లో టాప్ వ్యూడ్ టీజర్ గా దాదాపు 63లక్షల మంది ఈ టీజర్ ను వీక్షించారు.

మొత్తంగా చూసుకుంటే ఫర్స్ట్ లుక్, టీజర్ ట్రైలర్ అన్నీ వెరసి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. మరి ఈ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో? అసలు సినిమా విడుదల తరువాత ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో? కొత్తదనానికి కవర్ పేజ్ ఎలా ఎలా మారుతుందో తెలియాలి అంటే మనం సెప్టెంబర్ 27వరకూ ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus