రవితేజ గురించి ఆసక్తికర సంగతులు చెప్పిన సీరత్
- May 12, 2017 / 07:08 AM ISTByFilmy Focus
రన్ రాజా రన్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ సీరత్ కపూర్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. రాజు గారి గది 2 మూవీలో నాగార్జున సరసన నటిస్తున్న ఈ కర్లీ హెయిర్ భామ రవితేజ టచ్ చేసి చూడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అల్లు శిరీష్ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా సైన్ చేసింది. అయితే ఈమె రీసెంట్ గా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న టచ్ చేసి చూడు షూటింగ్ లో జాయిన్ అయింది. రవితేజతో కలిసి రొమాంటిక్ సీన్లో పాల్గొంది. ఈ షూటింగ్ విశేషాలను ఆమె పంచుకుంది. “రవితేజ సెట్ లో ఉంటే ఎవరూ డల్ గా ఉండరు. నేను మొదటి రోజు రొమాంటిక్ సీన్ లో పాల్గొన్నాను. అయితే నేను నెర్వస్ గా ఫీల్ కాలేదు. జాలీగా జరిగిపోయింది.
తొలిరోజే నాకు అర్ధమయిన విషయం ఏమిటంటే.. రవితేజ ఉంటే ఎటువంటి సమస్య ఉండదు” అని మాస్ మహారాజ్ ని అభినందనలో ముంచెత్తింది. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో సీరత్ వర్కింగ్ యంగ్ లేడీగా నటిస్తోంది. బెంగాల్ టైగర్ సినిమా తర్వాత రవితేజ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















