తెలుగు తమిళ భాషల్లో నయనతార స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా దూసుకువుతున్న ఈ భామ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటుంది. కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న నయన్ పై ఓ సీనియర్ నటుడు, డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాధారవి కొన్ని అసభ్యకరమైన కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. దీంతో పార్టీ ఆయన పై సస్పెన్షన్ వేటు వేసిందట. అసలు విషయానికి వెళితే.. నయనతార నటించిన తాజా చిత్రం ‘కొలైయుధీర్ కాలం’. హారర్, థ్రిల్లర్ కాసెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో వేడుకను ఇటీవల చెన్నైలో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసారు రాధారవి. అయితే నయనతార ఈ ఆడియో వేడుకకు నయనతార రాలేదు. ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని విధంగా నయన్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు రాధారవి.
ఈ వేడుకలో రాధారవి మాట్లాడుతూ… “నయనతార ఓ మంచి నటి, సినీ రంగంలో ఓ హీరోయిన్ ఇంతకాలం కొనసాగడం చిన్న విషయం కాదు. నయనతార ఒక చిత్రంలో దెయ్యంగా నటించింది, మరో చిత్రంలో సీతగా కనిపించింది. ఇప్పుడు ఎవరైనా సీతగా నటించ వచ్చు. ఇంతకముందు సీతగా నటించడానికి కేఆర్ విజయను మాత్రమే ఎంపిక చేసుకునేవారు. ఇప్పుడు మాత్రం చూడగానే నమస్కరించాలనే వారు మాత్రమే కాకుండా… చూడగానే పిలవాలనిపించే వారు కూడా సీత పాత్ర చేయొచ్చు. నయనతారని చూస్తే దెయ్యాలు కూడా పారిపోతాయి.” అంటూ నయన్ పై వివాదాస్పద కామెంట్లు చేసాడు. ఇపుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇదిలా ఉండగా ఈ కామెంట్స్ విన్న నయనతార బాయ్ ఫ్రెండ్ విజ్ఞేశ్ శివన్.. రాధారవి పై ఆగ్రహంగా ఉన్నాడు. ‘పెద్దవారై ఉండి ఇలా బుర్ర లేకుండా చెత్త వ్యాఖ్యలు చేయడం ఏంటి’ అంటూ ఫైర్ అవుతున్నాడు.