సీనియర్ నటి ఆమని సంచలన వ్యాఖ్యలు

  • July 2, 2018 / 12:56 PM IST

క్యాస్టింగ్ కౌచ్.. అనే మాట టాలీవుడ్ లో బాంబ్ మాదిరిగా పేలి ఏడాదికి పైనే అవుతోంది. అయినా అది రగిల్చిన మంట మాత్రం ఆరడం లేదు. ఎంతమంది ఆర్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీఎవరో ఒకరు మంటని పెద్దది చేస్తున్నారు. తాజాగా అలనాటి సీనియర్ హీరోయిన్ ఆమని కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేసింది. హీరోయిన్ గా జంబలకిడి పంబ, మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం వంటి ఎన్నో హిట్స్ అందుకున్న ఈమె రీ ఎంట్రీలోను ఆ నలుగురు, ఎంసీఏ, భరత్ అనే నేను చిత్రాలతో విజయాన్ని సొంతంచేసుకున్నారు. నిజ జీవితంలోను, సినీ కెరీర్ లోను ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఈమె క్యాస్టింగ్ కౌచ్.. పై తాజాగా మాట్లాడింది.

హీరోయిన్ గా అవకాశాల కోసం తిరిగే రోజుల్లో తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు చెప్పింది. “కొత్త నిర్మాణ సంస్థల నుంచి నేను కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నాను. నన్ను, నా ఫొటోలు చూసేవారు. ఓకే, చాలా బాగున్నావ్ అనేవారు. మరుసటి రోజు ఫోన్ చేసి, మన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి రండి కాస్త మేకప్ టెస్ట్ చేయాలి అనేవారు. నాకు గెస్ట్ హౌస్ అనగానే పరిస్థితి అర్థమైపోయేది. గెస్ట్ హౌస్ కు వెళ్లడం సమస్య కాదు. కానీ తల్లిని తీసుకురావొద్దని చెప్పడంతో నాకు విషయం పూర్తిగా అర్థమైపోయేది.” అని ఆనాటీ సంగతులు బయటపెట్టింది. కేవలం టాలీవుడ్ నుంచే కాకుండా కోలీవుడ్ నుంచి కూడా తను కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. అయితే పేరున్న సంస్థలు, ప్రముఖ నిర్మాతలు ఎప్పుడూ చెడుగా ప్రవర్తించేవారు కారని ఆమనీ స్పష్టం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus