‘అల్లరి’ సినిమాతో నటిగా పాపులర్ అయింది సుభాషిణి. ఆ తరువాత ‘చెన్నకేశవ రెడ్డి’, ‘ఈశ్వర్’, ‘శ్రీఆంజనేయం’, ‘నచ్చావులే’ ఇలా చాలా సినిమాల్లో నటించారామె. మెల్లగా ఈమెకి సినిమా అవకాశాలు తగ్గాయి. కొన్నాళ్లక్రితం ఈమె క్యాన్సర్ బారిన పడింది. ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ అండగా నిలిచారు. ఆమె ట్రీట్మెంట్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేయి ప్రాణాలను నిలబెట్టారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. రీసెంట్ గా ఈమె సుమ హోస్ట్ చేస్తోన్న క్యాష్ షోలో సందడి చేశారు.
సీనియర్ నటులు జెన్నీ, బాలాజీ, కృష్ణవేణిలతో కలిసి నవ్వించారు. ‘సుమ నీ డ్రెస్ బాగుంది’ రాగానే ఆమెపై ప్రేమ కురిపించారు సుభాషింది. జెన్నీకి పెళ్లి కాకముందు ఏదైనా ప్రేమకథ ఉందా..? అని సుమ అడగ్గా.. ఆయనకు పెళ్లి కన్నా ముందుకంటే ఇప్పుడు బోలేడు లవ్ స్టోరీలు ఉన్నాయంటూ సుభాషిణి కౌంటర్ ఇచ్చారు.కాసేపు నవ్వుల తరువాత భారతదేశ గొప్పతనం గురించి గేయం పాడి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది సుభాషిణి.
ఆ తరువాత యాంకర్ సుమ తనకు చేస్తున్న సాయం గురించి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ‘నేను ఈ రోజు ఇలా నిలబడ్డానంటే దానికి కారణం సుమనే. నాకు ఆరు నెలలకు ఒకసారి మెడిసిన్స్ పంపిస్తుంది సుమ. మళ్లీ నాకు మానవ జన్మ ఉంటే.. నాకు కడుపున నువ్వు పాపవై పుట్టాలి. బంగారు తల్లివమ్మా నువ్వు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు సుభాషిణి. వెంటనే సుమ ఆమె దగ్గరకి వెళ్లి హత్తుకుంది.
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!