సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సుహాసిని (Suhasini) అందరికీ సుపరిచితమే. తమిళనాడుకు చెందిన వ్యక్తే అయినప్పటికీ తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించారు. ఆమె కట్టు బొట్టు చూస్తే ఎవ్వరికైనా తెలుగింటి ఆడపడుచు అనే ఫీలింగ్ వస్తుంది. నటనలో కూడా సహజత్వం ఉంటుంది. అందుకే తెలుగులో కూడా ఆమె స్టార్ గా ఎదిగారు. తక్కువ టైంలోనే చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Nandamuri Balakrishna), వెంకటేష్ (Venkatesh), నాగార్జున (Nagarjuna) వంటి అగ్ర హీరోలందరి సరసన నటించారు.
తమిళంలో కూడా స్టార్ హీరోలందరి సరసన నటించారు. అటు తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంని ఈమె ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. సుహాసిని ఓ అరుదైన వ్యాధితో బాధపడిందట. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాసిని మాట్లాడుతూ.. “నాకు ఒక ఆరోగ్య సమస్య ఉంది. అదే టీబీ. కానీ దాన్ని నేను ఇప్పటివరకు సీక్రెట్ గా ఉంచాను.
దాని గురించి బయటకు తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో అనేది నా భయం. అందుకే ఎవ్వరికీ తెలియకుండా 6 నెలల వరకు చికిత్స తీసుకున్నాను. తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలియజేసి అందరికీ.. ఆ వ్యాధి గురించి ఆవాహన కల్పించాలని భావించాను” అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.
అయితే సుహాసిని 6 ఏళ్ళ వయసులోనే టీబీ బారిన పడినట్టు కోలీవుడ్ మీడియా వర్గాల టాక్. కొన్నాళ్లకే అది సెట్ అయ్యిందట. కానీ ఆమెకు 36 ఏళ్ళ వయసు వచ్చేసరికి.. మళ్ళీ టీబీ వల్ల ఇబ్బంది పడినట్టు కూడా పలు మీడియా ఛానళ్లు కథనాలు ప్రచారం చేస్తూ వచ్చాయి. ఇప్పుడైతే ఆమె ఆరోగ్యంతోనే ఉన్నారు.