జూనియర్స్ కంటే సీనియర్ హీరోలే బెటర్ అంటున్న రకుల్
- May 2, 2019 / 06:55 PM ISTByFilmy Focus
రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కార్తీ, సూర్య, మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, నాగచైతన్య, రవితేజ వంటి హీరోలందరితోనూ కలిసి ఒకటి లేదా రెండు సినిమాల్లో నటించేసిన తర్వాత కొత్తగా జత కట్టడానికి ఏ యంగ్ హీరో మిగలకపోవడంతో రకుల్ ఇప్పుడు సీనియర్ హీరోల మీద కాన్సన్ ట్రేట్ చేస్తోంది. ఆల్రెడీ హిందీలో అజయ్ దేవగన్, తెలుగులో నాగార్జునతో రొమాన్స్ చేస్తున్న రకుల్ ఇకపై సీనియర్ హీరోలతోనే జత కట్టాలని ఫిక్స్ అయ్యిందట. సీనియర్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ లకు హీరోయిన్ల కొరత ఉండడం..
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
రకుల్ కూడా ఇండస్ట్రీకి వచ్చి ఏడెనెమిదేళ్లు అయిపోతుండడంతో ఇంకా యంగ్ హీరోస్ తో మాత్రమే నటించాలని మకుపట్టు పట్టి కూర్చోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదని గ్రహించి ఈ నిర్ణయం తీసుకొంది రకుల్. తన సీనియర్ అయిన కాజల్ ను ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకొన్నట్లుంది రకుల్ పాప.మరి రకుల్ ప్లానింగ్ ఫలించి మళ్ళీ టాలీవుడ్ లో ఇదివరకట్లా బిజీ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే అమ్మడికి ఆఫర్లు గట్టిగానే ఉన్నాయి. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో అమ్మడు వరుస సినిమాలు సైన్ చేసింది. మరి ఈ స్పీడ్ ఇలాగే కొనసాగుతుందో లేదో














