మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కూడా వెంటనే ఒప్పేసుకుంటుంది. అప్పట్లో అయితే కథలు వినకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్బాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో మాత్రం అలా ఎవరు ఒప్పుకోవడం లేదు. ఇక సూపర్ స్టార్ 28వ సినిమా కోసం. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోయిన్స్ కోసం వేట మొదలు పెట్టినట్లు టాక్ వస్తోంది. ఇంతకుముందు పూజా హెగ్డేను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది.
అయితే మళ్ళీ ఆమెనే అయితే రొటీన్ గా ఉంటుందని ఎవరు ఒప్పుకోలేదట. ఇక మాటల మాంత్రికుడు ఎవరైనా కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడు. అదే విధంగా మహేష్ తో ఇంతవరకు నటించని బెస్ట్ బ్యూటీలపై కూడా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇక సీనియర్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు కూడా చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు తెలుగు సినిమాల వైపు చూడని ఈ బ్యూటీ ఆ మధ్యలో కొన్ని ఆఫర్లు రాగా రిజెక్ట్ చేసింది.
ఇద్దరు యంగ్ హీరోల సినిమాలకు నో చెప్పినట్లు అప్పట్లో టాక్ బాగానే వచ్చింది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ ఆమెపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్న విషయం తెలిసిందే.