90sలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన నటి మోహిని, కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమయ్యారు. ‘ఆదిత్య 369’, ‘హిట్లర్’ వంటి బ్లాక్ బస్టర్ల సినిమాల్లో నటించి స్టార్‌డమ్ సంపాదించుకున్న ఆమె, ప్రస్తుతం అమెరికాలో క్రైస్తవ మత ప్రచారకురాలిగా ఉంది. చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన కెరీర్‌లోని కొన్ని చీకటి కోణాలను, వ్యక్తిగత జీవితంలోని షాకింగ్ నిజాలను బయటపెట్టారు.
‘కన్మణి’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నప్పుడు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పి షాకిచ్చింది మోహిని. ఆ సినిమా షూటింగ్ టైంలో ఆమెకు ఈత రాకపోయినా, స్విమ్‌సూట్‌లో ఓ పాట ప్లాన్ చేశాడట దర్శకుడు.’స్విమ్‌సూట్ వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను చేయలేనని దర్శకుడి కాళ్లు పట్టుకుని ఏడ్చాను. అయినా కనికరించకుండా బలవంతంగా షూట్ చేశారు. నా కెరీర్‌లో నాకు ఇష్టం లేకుండా గ్లామరస్‌గా కనిపించింది ఆ ఒక్క సినిమాలో మాత్రమే’ అంటూ మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మోహిని.
అలాగే రజినీకాంత్ ‘ముత్తు’, సూర్య ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలు చేజార్చుకున్నట్టు కూడా చెప్పుకొచ్చింది. ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. ‘నా భర్త కజిన్ ఒకరు అసూయతో నాపై చేతబడి చేయించారని, ఆ క్షుద్ర ప్రయోగం నుంచి దేవుడి దయవల్ల బయటపడ్డాను’ అని ఈ సీనియర్ హీరోయిన్ చెప్పుకొచ్చింది. మోహిని ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఇక 1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘ఆదిత్య 369’ మోహిని మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.