Naresh: నరేష్ మూడో భార్య షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన సీనియర్ నరేష్ పవిత్ర లోకేశ్ ను నాలుగో పెళ్లి చేసుకోనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ వార్తలపై ఇప్పటికే స్పందించిన పవిత్ర లోకేశ్ నరేష్ ను నేను నిజంగానే పెళ్లి చేసుకోనున్నానని చెప్పుకొచ్చారు. కృష్ణ కుటుంబం సైతం తమ పెళ్లికి అంగీకారం తెలిపిందని ఆమె తెలిపారు. పవిత్రా లోకేశ్ క్లారిటీ ఇవ్వడంతో త్వరలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేశ్ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అయితే సీనియర్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మాత్రం గతంలో తాను డబ్బుల విషయంలో మోసం చేశానని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అన్నారు.

కరోనా పరిస్థితుల వల్ల కొంతమందికి తాను ఇవ్వాల్సిన డబ్బును ఆలస్యంగా చెల్లించానని ఆమె వెల్లడించారు. కొంతమంది నా గురించి తప్పుగా ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారని ఆమె కామెంట్లు చేశారు. నాపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు కాలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. సీనియర్ నరేష్ అతని కుటుంబం గురించి మాట్లాడుకోవాలని నా కుటుంబం గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం అయితే లేదని ఆమె తెలిపారు. ఇప్పటికీ తాను సీనియర్ నరేష్ భార్యనేనని ఆమె చెప్పుకొచ్చారు.

సీనియర్ నరేష్ తో నా సంబంధాలు తెగిపోలేదని నేను సీనియర్ నరేష్ భార్యనని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె తెలిపారు. నేను ఇంకా విడాకుల పేపర్లపై సంతకం చేయలేదని ఆమె తెలిపారు. తాను రఘువీరారెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తినే అయినా ఆ పేరును ఎప్పుడూ వాడుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు.

సీనియర్ నరేష్ నా గురించి మీడియాలో తప్పుడు కథనాలు వచ్చేలా ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు. నేను జర్నలిస్ట్ నని అయినా నా గురించే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె చెప్పుకొచ్చారు. నాకు ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఉందని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈమె వ్యాఖ్యలపై సీనియర్ నరేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus