Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

  • April 21, 2026 / 07:50 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

అర్జున్ అంబటి హీరోగా రూపొందిన యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘పరమపద సోపానం’. ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న నిర్మించగా పులగం సుప్రియ సహ నిర్మాతగా వ్యవహరించారు. నాగ శివ ఈ చిత్రానికి దర్శకుడు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

Paramapada Sopanam

ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ వేడుకకు సీనియర్ స్టార్ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర వంటి వారు హాజరయ్యారు. ఇందులో భాగంగా..

దర్శకులు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ..‘‘ప్రసన్న ఈ ‘పరమపద సోపానం’ చిత్రం గురించి నాకు చెప్పారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవుతానని ప్రసన్న నా దగ్గరకు వచ్చాడు. ఓ మూవీకి కూడా పని చేశాడు. దర్శకుడిగా కంటే ప్రొడక్షన్ సైడ్ వెళ్తే, ప్రొడక్షన్ మేనేజర్‌గా వెళ్తే బాగుంటుందని సలహా ఇచ్చాను. ఇప్పుడు మంచి స్థాయిలోకి వచ్చాడు. ఈ చిత్రంతో కొత్త వారు తెరకు పరిచయం కాబోతోన్నారు. నాగ శివ గారికి మంచి విజయం దక్కాలి. అర్జున్, జెన్నీఫర్‌లకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకులు సముద్ర మాట్లాడుతూ .. ‘అచ్చ తెలుగులో ‘పరమపద సోపానం’ అని టైటిల్ పెట్టారు. ప్రసన్నతో నాకెన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. నాగ శివ తీసిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అర్జున్ లుక్స్, యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. అర్జున్ పెద్ద హీరో అవుతాడు. జెన్నిఫర్‌కి తెలుగులో మంచి భవిష్యత్తు ఉండాలి. దేవ్ గారు మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా జనాలు ఆదరించి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకులు వీర శంకర్ మాట్లాడుతూ .. ‘పూరి గారి వద్ద పని చేయడం వల్ల శివకి సహనం ఎక్కువగా వచ్చినట్టుంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సినిమాని ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. ఫైనాన్షియల్ పరంగా నిర్మాతలు ఎప్పుడూ తెలివిగా ప్రవర్తించాలి. శివ తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి. అర్జున్ ప్రతీ ఫ్లాట్ ఫాం మీద తన సత్తాను చాటుకుంటూ వస్తున్నారు. ఆయన మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈశ్వర్ మంచి విజువల్స్ ఇస్తారు. దేవ్ గారు మంచి సంగీతం అందిస్తారు. ఏప్రిల్ 24న రాబోతోన్న ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ .. ‘లెజెండరీ డైరెక్టర్స్ భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర గారు మా ‘పరమపద సోపానం’ ఈవెంట్‌కి రావడం ఆనందంగా ఉంది. ఈ దర్శకులు తీసిన సినిమాల టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న రోజుల నుంచి ఈ రోజు నా సినిమాకు వాళ్లు గెస్టులుగా రావడం ఆనందంగా ఉంది. ప్రసన్న, శివ, వీర శంకర్ గారి వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. దేవ్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈశ్వర్‌తో నేను ఇది వరకు మూడు సినిమాలు చేశాను. రాంబాబు గారు మాకు మంచి పాటల్ని ఇచ్చారు. ‘పరమపద సోపానం’తో మేం మంచి ప్రయత్నం చేశాం. థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నచ్చుతుంది. ఏప్రిల్ 24న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ .. ‘‘పరమపద సోపానం’ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాగ శివ గారు నా పాత్రను అద్భుతంగా రాశారు. ఇలాంటి ఓ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. అర్జున్ అంబటితో కలిసి మళ్లీ మళ్లీ పని చేయాలని ఉంది. మా మూవీని అందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు నాగ శివ మాట్లాడుతూ .. ‘‘పరమపద సోపానం’ కోసం ప్రాణం పెట్టి పని చేశాం. ఎంతో మంది ఈ సినిమాని వెనక్కి లాగాలని ప్రయత్నించారు. కానీ చాలా మంది సపోర్ట్‌తో ఇక్కడి వరకు తీసుకు వచ్చాను. వీర శంకర్ గారికి మా కష్టాల్ని చెప్పాం. ఆయనే ముందుండి మమ్మల్ని నడిపించారు. మా నాన్న గారిని చివరి అస్త్రంగా వాడాను. ఆయన రాకతో నా కష్టాలు తీరాయి. ప్రసన్న గారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. దేవ్ గారు మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. రాంబాబు గారు నాకెంతో సపోర్ట్ చేశారు. తక్కువ టైంలో ఈశ్వర్ మాకు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. అర్జున్ వల్లే ఈ మూవీని ఇక్కడి వరకు తీసుకు రాగలిగాను. జెన్నిఫర్ చక్కగా నటించారు. కోటేశ్వరరావు గారు ఎప్పుడూ నా వెంటే ఉన్నారు. అన్ని కష్టాల్ని దాటుకుని మా సినిమాని ఏప్రిల్ 24న తీసుకు రాబోతోన్నాం. మా కోసం వచ్చిన భీమనేని శ్రీనివాసరావు గారు, వీర శంకర్ గారు, సముద్ర గారికి థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరూ మా సినిమాని చూసి తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

రాంబాబు గోసాల మాట్లాడుతూ ..‘‘పరమపద సోపానం’లో అన్ని పాటలు రాయడం ఆనందంగా ఉంది. దేవ్ గారు ఈ చిత్రానికి మంచి పాటల్ని, అద్భుతమైన ఆర్ఆర్‌ను ఇచ్చారు. శివ గారు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. అర్జున్ గారితో నేను ఇది వరకు పని చేశాను. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత గణపర్తి నారాయణరావు మాట్లాడుతూ .. ‘శివ మా అబ్బాయి. హైదరాబాద్‌కి వచ్చి సెటిల్ అయ్యాడు. సినిమానే జీవితంగా మార్చుకున్నాడు. మా సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు మాట్లాడుతూ .. ‘మా కోసం ఇక్కడకు వచ్చిన భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర గారికి థాంక్స్. నేను ఈ రోజు ఎక్కువ మాట్లాడను. ఏప్రిల్ 24న మా చిత్రం రాబోతోంది. ఆ రోజు మాట్లాడతాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ మాట్లాడుతూ .. ‘నాకు శివతో పదిహేనేళ్ల బంధం ఉంది. ఎప్పుడూ కథలు, స్క్రిప్ట్‌ల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఈ మూవీ కోసం శివ ఎంతో కష్టపడ్డారు. అర్జున్ అంబటి, జెన్నిఫర్ అద్భుతంగా నటించారు. ఇదొక ఎమోషనల్ మూవీ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డీఓపీ ఈశ్వర్ మాట్లాడుతూ .. ‘‘పరమపద సోపానం’ అద్భుతమైన థ్రిల్లర్. అర్జున్‌లో అందరూ ఓ కొత్త యాంగిల్ చూస్తారు. జెన్నీఫర్ చక్కగా నటించింది. మా మ్యూజిక్, విజువల్స్ కొత్తగా ఉంటాయి. ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్లంతా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఏప్రిల్ 24న మా చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

10 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

22 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

6 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

7 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

8 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

9 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version