సెన్సేషనల్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’ ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌

సెన్సేషనల్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో, ప్రణదీప్‌ ఠాకూర్‌ దర్శక, నిర్మాణంలో రూపొందిన మూవీ ‘రక్షణ’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ జూన్‌ 7న బాక్సాఫీసు ముందుకొచ్చి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు థ్రిల్‌ పంచేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ ఓటీటీలో “భవానీ మీడియా ” డిజిటల్ డిస్ట్రిబ్యుషన్ చేస్తోంది.

రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు, ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ “లేడి సింగం” గా అదరగొట్టింది. కథ, కథనం, పెర్ఫార్మెన్స్ లు ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ అందించేలా వుంటాయి.

మానస్ నాగులపల్లి, రాజీవ్ కనకాల, చక్రపాణి ఆనంద ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యంగ్ కంపోజర్ మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు.

ఈ వీకెండ్ ఓటీటీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి “ఆహా” లో “రక్షణ” మూవీ ఫస్ట్ ఛాయిస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus