బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైష్ణవి ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ దూరంగా ఉంటున్నారు. అయితే ఈమె గత రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని పూర్తిగా సీరియల్స్ కి దూరంగా ఉంటున్నారు ఇకపోతే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా వైష్ణవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నూతన గృహప్రవేశానికి సంబంధించినటువంటి వీడియోని షేర్ చేశారు.
ఇలా తన భర్త కుమారుడితో కలిసి ఈమె కొత్త ఇంట్లోకి వెళ్లినట్టు తెలియజేశారు. అయితే ఈమె తన సొంత ఇంట్లోకి కాకుండా అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అయినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు కాస్త ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలోనే మరొక ఇంటికి వెళ్లినట్లు వైష్ణవి ఈ వీడియోలో తెలియజేశారు. ఇలా అద్దె ఇంట్లో ప్రస్తుతం ఇంకా పనులు జరుగుతున్నాయని అందుకే తాను సామాన్లు అక్కడికి తీసుకు వెళ్ళలేక రైస్ కుక్కర్ లోనే పాలు పొంగిస్తున్నట్లు వెల్లడించారు.
ముందుగా దేవుడి గదిలో శుభ్రం చేసి దేవుడి ఫోటోలను అలంకరించి పూజ చేశారు అనంతరం పాలు పొంగించి ఈమె తన అద్దె ఇంటిని మొత్తం ఈ వీడియోలో చూపించారు. వైష్ణవి ఇదివరకే కమ్యూనిటీలో ఒక హౌస్ కొనుగోలు చేశారు. అయితే ఆ హౌస్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్న నేపథ్యంలో ఈమె అద్దె ఇంట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ అద్దె ఇల్లు కూడా కాస్త ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలోనే మరొక ఇంటికి షిఫ్ట్ అవుతున్నట్లు వైష్ణవి తెలిపారు.
త్వరలోనే తమ (Vyshnavee Gade) సొంత ఇంటికి వెళ్ళబోతున్నామని ప్రస్తుతానికి అద్దె ఇంట్లో చేరాము అంటూ ఈ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో త్వరలోనే మీ సొంత ఇంటి కల కూడా నెరవేరాలి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!