Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

ప్రీరిలీజ్‌ ఈవెంట్, సక్సెస్‌ మీట్‌ ఇలా ఏదైనా ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చినప్పుడు చిరంజీవిలో మరో యాంగిల్‌ను మనం చూస్తాం. ఆ సినిమా నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని తెగ మెచ్చేసుకుంటూ ఉంటారాయన. అయితే ఒక్కోసారి ఆయన మాటలు చూస్తే పొగిడి పొగిడి మరీ అంతెత్తున కూర్చోబెట్టాలా అనే డౌట్‌ వస్తుంది. అలా ఇప్పుడు రష్మిక మందన (Rashmika Mandanna) ను చిరంజీవి (Chiranjeevi) ఏకంగా ఇంటర్నేషనల్‌ క్రష్‌ని చేసేశారు.

Chiranjeevi

‘కుబేర’ (Kuberaa) సినిమా సక్సెస్‌ మీట్‌లో ఇదంతా జరిగింది. ఆయన వ్యాఖ్యలు, దానికి రష్మిక రియాక్షన్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.‘కుబేర’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. దీంతో ఆదివారం సాయంత్రం సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. దీనికి మెగాస్టర్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. సినిమాపై, టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో కథానాయిక రష్మిక మందన (Rashmika Mandanna) ని తెగ మెచ్చుకున్నారు. కొన్ని సన్నివేశాల్లో రష్మిక అదరగొట్టింది అని వివరిస్తూ మాట్లాడారు. నువ్వు నేషనల్ క్రష్ మాత్రమే కాదు నా క్రష్ కూడా.

నీ మొదటి సినిమా ఈవెంట్‌కి నేనే గెస్ట్‌గా వచ్చాను అని గుర్తు చేశారు.నీ తొలి సినిమా నుండి యాక్టింగ్ చూస్తున్నా. సినిమా సినిమాకి నీ ఇమేజ్ పెరుగుతూనే ఉంది. ‘కుబేర’ (Kuberaa) సినిమాలో నువ్వు మొదట్లో రాజు అనే నీ లవర్ చేతిలో మోసపోయిన సీన్‌ చూసినప్పుడు ‘చూడాలని ఉంది’ సినిమాలో సౌందర్యలా కనిపించావు అని మెచ్చుకున్నారు చిరంజీవి (Chiranjeevi). క్లైమాక్స్‌కి ముందు పసిబిడ్డని చేతిలో పట్టుకున్నప్పుడు నీ యాక్టింగ్ ఇంకా బాగుది. నువ్వు స్క్రీన్ మీద కనిపిస్తే నీ కళ్లు మాత్రమే చూస్తా.

నువ్వు కళ్లతోనే నటిస్తావు అని ఆమె నటన గురించి, ప్రజెన్స్‌ గురించి మాట్లాడారు చిరంజీవి.ఆఖరులో నువ్వు నేషనల్ క్రష్ కాదు.. ఇంటర్నేషనల్ క్రష్ అంటూ ‘పుష్ప’ (Pushpa) స్టైల్‌లో ఎలివేషన్‌ ఇచ్చారు చిరంజీవి. అంతకుముందు నాగార్జున మాట్లాడుతూ రష్మికను శ్రీదేవితో పోల్చారు నాగార్జున (Nagarjuna). ‘క్షణక్షణం’ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) లా ఉన్నావని చెప్పారు. అలా ఒకే స్టేజీ మీద ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో పోలికను సంపాదించుకుంది రష్మిక మందన.

ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus