Shah Rukh Khan: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

  • August 8, 2023 / 09:58 AM IST

సాధార‌ణంగా సెల‌బ్రెటీలు బ‌య‌ట క‌నిపించారంటే చాలు సెల్ఫీ, ఆటోగ్రాఫ్ అంటూ జ‌నాలు మీద మీద ప‌డిపోతుంటారు. అందుకే సినీ తార‌లు బ‌య‌ట కాలు పెడితే ఖ‌చ్చితంగా ప‌క్కన బాడీగార్డ్స్ ఉండాల్సిందే. అందులోనూ స్టార్ హీరోలు, హీరోయిన్లు బాడీగార్డ్ లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే ఇక అంతే సంగ‌తలు. అందుకే స్టార్స్ సొంతంగా బాడీగార్డ్స్ ను మెయింటైన్ చేస్తుంటారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కు కూడా సొంతంగా బాడీగార్డ్ ఉన్నాడు. అత‌న పేరు ర‌వి సింగ్‌. సినిమా ప్రమోషన్లు, పుట్టినరోజు వేడుకలు లేదా బహిరంగ ప్ర‌దేశాల్లో..

రవి సింగ్‌ ఎల్లప్పుడూ ఖాన్ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుతూ కనిపిస్తాడు. (Shah Rukh Khan) షారుఖ్ ఖాన్ ఇంట్లో నుంచి కాలు బ‌య‌ట‌పెట్టాడంటే ప‌క్క‌న ర‌వి సింగ్ ఉండాల్సిందే. అయితే ర‌వి సింగ్‌ జీతం ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు. ఎందుకంటే, షారుఖ్ త‌న బాడీగార్డ్ కు ప్ర‌తి ఏడాది రూ. 2.7 కోట్లు చ‌ల్లిస్తాడ‌ట‌. సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే బాడీగార్డ్‌లలో ర‌వి సింగ్ ఒకరు. షారూఖ్ ఖాన్ వంటి స్టార్‌ని రక్షించడం చాలా కష్టమైన పని.

కానీ, ఆ బాధ్య‌త‌ను ర‌వి సింగ్ గ‌త కొన్నేళ్ల నుంచి స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్నాడు. అందుకే అత‌నికి అంత మొత్తంలో జీతం ఇస్తున్నార‌ట‌. రవి సింగ్ కేవ‌లం షారుఖ్ ఖాన్ యొక్క భద్రతకు మాత్రమే కాకుండా ఆయ‌న పిల్ల‌లు ఆర్యన్, సుహానా మరియు అబ్రామ్ ల‌కు కూడా దగ్గరగా ఉంటూ కాపాడుతున్నాడు. కాగా, ఇటీవల పఠాన్ సినిమా సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చిన షారుఖ్ ఖాన్‌..

ప్ర‌స్తుతం `జ‌వాన్‌` మూవీతో బిజీగా ఉన్నాడు. త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ తెర‌కెక్కిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీతో లేడీ సూప‌ర్ స్టార్ నయ‌న‌తార బాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతోంది. ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus