Shah Rukh Khan: పాములతో ఫోటోలకు ఫోజులిచ్చిన షారుక్.. ఫోటోలు వైరల్

Advertisement

భారతదేశంలోనే అపర కుబేరుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖేష్ అంబానీ ఇంట పార్టీ అంటే ఎంతో ఘనంగా ఎంతో వేడుకగా ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. ఇంట్లో పార్టీ జరుగుతుంది అంటే బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ పార్టీలో సందడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ముఖేష్ అంబానీ ఇంట ఘనంగా ఓ పార్టీ జరిగింది. ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ కవల పిల్లల పుట్టిన రోజు కావడంతో ముఖేష్ అంబానీ ఎంతో ఘనంగా బర్త్డే పార్టీని నిర్వహించారు.

ఈ పార్టీలో భాగంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ సైతం ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా షారుఖ్ ఖాన్ అనంత్ అంబానీ తో మాట్లాడుతూ ఉంటారు ఈ క్రమంలోనే అనంత్ ఒక పామును తీసుకువచ్చి షారుఖ్ ఖాన్ చేతిలో పెట్టారు.

అనంతరం మరొక వ్యక్తి వెనుక నుంచి మరొక పాములను తీసుకువచ్చి షారుక్ ఖాన్ మెడలో వేశారు. ఇలా బ్రతికి ఉన్నటువంటి పాములతో ఈయన సరదాగా ఆటలాడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇలా బ్రతికున్న పాములతో ఆటలు ఆడటం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇక షారుక్ ఖాన్ (Shah Rukh Khan) సినిమాల విషయానికి వస్తే డిసెంబర్ 21వ తేదీన డుంకి ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై కూడా ఎన్నో అంచనాలు ఉండడమే కాకుండా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news