‘ఫ్యాన్’ దర్శకుడితో షారుఖ్ మరోసారి..!
- April 21, 2016 / 01:18 PM ISTByFilmy Focus
‘ఫ్యాన్’ చిత్రానికి ఎటువంటి సీక్వెల్ లేదని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ స్పష్టం చేశాడు. ‘ ఫ్యాన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఈ చిత్రం ఫ్యాన్ చనిపోయాడు. మనీష్ శర్మ తెరకెక్కించనున్న మరో చిత్రంలో నేను నటిస్తున్నాను. ఇది ఫ్యాన్ కు పూర్తి భిన్నమైన కథ.
మనీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం వచ్చే ఏడాది నుంచి ప్రారంభం అవుతుంద’ని షారుఖ్ తెలిపాడు. కాగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యాన్ చిత్రంలో షారుఖ్ రెండు పూర్తి భిన్నమైన పాత్రల్లో నటించగా.. ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేయడం లో మాత్రం విఫలం అయ్యింది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












