Shah Rukh Khan: అమితాబ్ కి పాదాభివందనం చేసిన షారుక్… జయ బచ్చన్ పై ట్రోలింగ్స్!

కోల్ కత్తా ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక చిన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ దంపతుల కాళ్లకు నమస్కరించారు. ఈ విధంగా అమితాబ్ ఆశీర్వాదం తీసుకున్న అనంతరం అమితాబ్ షారుఖ్ ను పైకి లేపి తనని కౌగిలించుకొని ఎంతో ప్రేమగా అతనితో మాట్లాడారు.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజెన్లు జయా బచ్చన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. షారుక్ జయ బచ్చన్ అమితాబ్ పాదాలకునమస్కరిస్తున్న సమయంలో జయ బచ్చన్ అతనిని అలా చేయకుండా అడ్డుకున్నారు. అదే సమయంలోనే అక్కడికి రాణి ముఖర్జీ కూడా వచ్చారు. ఈ విధంగా రాణి ముఖర్జీ అక్కడికి రావడంతో జయ బచ్చన్ ఏకంగా లేచి ఆమెను కూర్చోబెట్టారు. దీంతో షారుఖ్ అభిమానులు దారుణంగా జయ బచ్చన్ ను ట్రోల్ చేస్తున్నారు.

షారుక్ వచ్చినప్పుడు లేవలేదు కానీ రాని ముఖర్జీ వచ్చినప్పుడు లేవడంతో ఈమె నేటిజెన్ల ట్రోలింగ్ కి గురయ్యారు. అయితే జయా బచ్చన్ తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలవడమే కాకుండా భారీగా ట్రోలింగ్ కి గురవుతుంటారు. ఈ క్రమంలోనే మరోసారి నేటిజన్స్ ఈమెను ఈమె వ్యవహరి శైలి పట్ల దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus