బాలీవుడ్ లో బ్రేకప్ లు ప్యాచప్ లు చాలా కామన్ అయిపోయాయి. కానీ, అప్పుడెప్పుడో బ్రేకప్ చేసుకొన్న బాలీవుడ్ హాట్ కపుల్ షాహిద్-కరీనాలు మాత్రం వారి మనసుల్లోంచి ఇంకా వారి గత జ్ణాపకాలను చెరిపేసినట్లు లేరు. చాలా కాలం తర్వాత వారిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారు, అది కూడా ఇద్దరికీ కాంబినేషన్ సీన్స్ లేవని నిర్ధారించుకొన్నాక. “ఉడ్తా పంజాబ్” అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటోంది. ఇటీవల ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొన్న షాహిద్-కరీనా జంట కనీసం పక్కపక్కన నిల్చోవడానికి కూడా నిరాకరించారు. వారిద్ధరీ మధ్యలో ఆలియా భట్ నిల్చోంటేనే కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఇక నుంచి ఏ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్నా కూడా షాహిద్-కరీనాలు పక్కన నిల్చోకుండా ఉండాలని “ఉడ్తా పంజాబ్” బృందం జాగ్రత్తలు తీసుకొంటోంది. ఆ తరహా జాగ్రత్తలు తీసుకోకపోతే.. ప్రమోషన్స్ లో పాల్గొనమని షాహిద్ మరియు కరీనాలు పేర్కొనడం విశేషం!