సినిమా షూటింగ్ లో ఒక్కోసారి ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. వాటి కారణంగా హీరోలు కూడా గాయపడిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా షూటింగ్ సెట్ లో గాయపడినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. హిందీ ‘జెర్సీ’ సినిమా కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుండగా.. తీవ్రంగా గాయపడినట్లు షాహిద్ పేర్కొన్నారు. గ్రౌండ్ క్రికెట్ ఆడుతుండగా.. తన కింది పెదవికి బాల్ బలంగా తాకడంతో 25 కుట్లు పడ్డాయని చెప్పాడు షాహిదీ.
బాల్ బలంగా తాకడంతో పెదవి చిట్లిందని.. పాతిక కుట్లు పడ్డాయని.. ఈ గాయం వలన తన పెదవి ఎప్పటికీ పని చేయదేమోనని భయపడ్డానని చెప్పుకొచ్చారు. కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని.. ఈ ప్రమాదం కారణంగా రెండు నెలల పాటు షూటింగ్ ఆపేశామని చెప్పారు. నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాకి ఇది రీమేక్. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో షాహిద్ ఇండియన్ టీమ్ లో చోటు సంపాదించుకోవాలని పరితపించే క్రికెటర్ గా కనిపించనున్నారు.
హిందీలో అల్లు అరవింద్ సమర్పణలో దిల్రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్గిల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో షాహిద్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.