ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల ఈయన రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. దీపికా పదుకొనేతో కలిసి షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి 1000 కోట్ల క్లబ్లో చేరారు. అదేవిధంగా జవాన్ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకుంది.
ఇకపోతే ఈయన త్వరలోనే డంకీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 21వ తేదీ షారుఖ్ ఖాన్ సినిమా విడుదల కాగా 22వ తేదీ ప్రభాస్ సలార్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇకపోతే తాజాగా నటుడు షారుఖ్ ఖాన్ వైష్ణోదేవి మాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అయితే ఈయన సినిమా విడుదలకు ముందు అమ్మవారి ఆలయానికి వెళ్ళటం విశేషం గత రెండు సినిమాలు విడుదలకు ముందు కూడా (Shahrukh Khan) షారుఖ్ ఖాన్ ఇలాగే ఈ ఆలయానికి వెళ్లారు.
ఇక ఈయన నటించిన ఆ రెండు సినిమాలు కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇకపోతే మూడోసారి కూడా తన సినిమా విడుదలకు ముందు అమ్మవారి ఆలయానికి షారుక్ ఖాన్ వెళ్లడంతో ఈ ఆలయాన్ని సినిమా విడుదలకు ముందు దర్శించుకోవడం తన సినిమాలకు సెంటిమెంటుగా మారిపోయిందా అందుకే షారుక్ ఇలా ఈ ఆలయానికి వెళ్తున్నారా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!