గతవారం విడుదలై కలక్షన్ల వర్షం కురిపిస్తున్న సినిమా అర్జున్ రెడ్డి. ఇందులో హీరోయిన్ ప్రీతిగా నటించిన శాలిని పాండే ఎక్కువమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా ఆమె మీడియా ముందుకు వచ్చి రియల్ లైఫ్ గురించి అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది. “మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్ మాది. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగి. నాకు చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలనే ఆశ ఉండేది. కానీ నాన్న ఒత్తిడితో ఇంజినీరింగ్ చదివాను. అదే సమయంలో థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాను.” అని చెప్పారు. “ఇంట్లో ఎవరికీ నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు.
ఈ విషయంలో మా నాన్న చాలా స్ట్రిక్టుగా ఉండేవారు. ఐటీ జాబ్‌లో జాయిన్ అవ్వమని ఫోర్స్ చేశారు. అపుడు నా కల నెరవేర్చుకోవడానికి ముంబైలో ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి ముంబై వెళ్ళిపోయాను” అని వివరించారు. తన తండ్రి పోలీస్ కంప్లైన్ట్ ఇస్తానని బెదిరించినా, ఫ్యామిలీని వదులుకోవడానికి సిద్ధపడిందికానీ సినీ రంగాన్ని షాలిని వదులుకోలేదు. ముంబైలో పస్తులతో, ఇరుకు గదుల్లో గడిపిన క్షణాల గురించి వివరించింది. అకష్టాలన్నింటినీ అర్జున్ రెడ్డి సినిమా బయటపడేసిందని వెల్లడించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.