మరో సెన్సేషనల్ సినిమాలో షాలిని!
- September 11, 2017 / 06:18 AM ISTByFilmy Focus
“అర్జున్ రెడ్డి”లో ప్రీతిగా అత్యంత ప్రీతిపాత్రమైన పాత్రలో మెప్పించిన జబల్ పూర్ సుందరి షాలిని పాండే ప్రస్తుతం స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తూ బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నా.. చాలా సెలక్టడ్ గా తనకు నచ్చిన స్క్రిప్ట్ మాత్రమే సైన్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ 23 ఏళ్ల సుందరి.. ఒక భారీ ప్రొజెక్ట్ చేసినట్లు వినికిడి. అలనాటి మేటినటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న “మహానటి” సినిమాలో టైటిల్ రోల్ ను తమిళనటి కీర్తి సురేష్ ప్లే చేస్తుండగా.. మరో ముఖ్యపాత్రలో సమంత కనిపించనుంది. అయితే.. సావిత్రితో కలిసి కాంబినేషన్ లో లెక్కకుమిక్కిలి సినిమాల్లో నటించిన జమున క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకం.
చలాకీతనం, చిలిపిదనం కలగలిసిన ఈ క్యారెక్టర్ కోసం చాన్నాళ్లు వెతికిన చిత్రబృందం “అర్జున్ రెడ్డి” రిలీజ్ అయ్యాక షాలినిని చూసి “ఈ అమ్మాయి అయితేనే బాగుంటుంది” అని ఫిక్స్ అయ్యారట. వెంటనే షాలినిని సంప్రదించడం, అమ్మడు సరేననడంతో.. జమునగా షాలిని పేరు ఫిక్స్ అయిపోయింది. ఈ ప్రొజెక్ట్ మాత్రమే కాక తమిళంలోనూ అమ్మడికి బోలెడు ఆఫర్లు వస్తున్నాయని వినికిడి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే స్టార్ హీరోయిన్ అవ్వడానికి అన్నీ అర్హతలు పుష్కలంగా ఉన్న షాలిని ప్లానింగ్ ఎలా ఉందో మరి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













