గడిచిన మూడు సంవత్సరాల్లో టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్ల పారితోషికాలు అంచనాలకు అందని స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో తన స్థాయికి తగిన సక్సెస్ లేని శంకర్ సినిమాలను మాత్రం భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రామ్ చరణ్ శంకర్ కాంబో సినిమాను నిర్మిస్తున్నారనే సంగతి తెలిసిందే. శంకర్ ఈ సినిమా కోసం ఏకంగా 60 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
శంకర్ తీసుకుంటున్న పారితోషికం స్టార్ హీరో రామ్ చరణ్ తీసుకుంటున్న పారితోషికం కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. శంకర్ చరణ్ తో పొలిటికల్ బేస్డ్ డ్రామాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చరణ్ సినిమాకు శంకర్ తీసుకుంటున్న పారితోషికం తన సినీ కెరీర్ లోనే హైయెస్ట్ అని తెలుస్తోంది. అయితే దిల్ రాజు సినిమా బడ్జెట్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు.
దిల్ రాజు నిజంగానే శంకర్ కు 60 కోట్ల రూపాయలు ఇస్తున్నారా..? లేదా..? అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. శంకర్ సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకున్నా లాభాల్లో వాటా కూడా తీసుకుంటారు. మరి దిల్ రాజు శంకర్ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో తెలియాల్సి ఉంది. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!</a