Bigg Boss 5 Telugu: షణ్ముక్ ఫ్యాన్స్ హ్యాపీ..! రేషన్ మేనేజర్ ఎవరయ్యారో తెలుసా..?

  • October 28, 2021 / 10:44 AM IST

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం కెప్టెన్సీ కోసం ఏకంగా ఆరుగురు పోటీపడుతున్నారు. ఇందులో షణ్ముక్, సిరి, శ్రీరామ్, అనీమాస్టర్, సన్నీ ఇంకా మానస్ లు ఉన్నారు. అభయహస్తం టాస్క్ లో ఛాలెంజస్ ని గెలిచిన వీళ్లకి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. బస్తాల్లో ఉన్న థర్మాకోల్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడే ఒకరి బస్తాని ఇంకొకరు ఖాళీ చేయచ్చు. చివరకి ఎవరి బస్తా అయితే ఎక్కువగా థర్మాకోల్స్ తో ఉంటుందో వాళ్లు విజేత. ఇందులో షణ్ముక్ జస్వంత్ గెలిచినట్లుగా సమాచారం తెలుస్తోంది.

ఈ టాస్క్ లో సన్నీకి, శ్రీరామ్ చంద్రకి పెద్ద యుద్ధమే జరిగింది. నువ్వు ఇండివెడ్యువల్ గా గేమ్ ఆడుతున్నావని అనుకున్నాను, కానీ నువ్వు కూడా గ్రూప్ గానే ఆడుతున్నావంటూ శ్రీరామ్ మాట్లాడాడు. ఇక్కడే సన్నీకి కోపం వచ్చింది. ఇద్దరూ మాటల యుద్ధానికి దిగారు. ఇది ప్రోమోలో చాలా ఆసక్తికరంగా చూపించారు.ఇక ఈ టాస్క్ లో మిగతా వాళ్లందరినీ ఓవర్ టేక్ చేస్తూ తన బస్తాలో థర్మాకోల్స్ ని కాపాడుకున్న షణ్ముక్ కెప్టెన్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో 8వారాలు గడుస్తున్నా ఇంతవరకూ షణ్ముక్ కి కెప్టెన్సీ పోటీదారుడిగా అవకాశం రాలేదు. లాస్ట్ టైమ్ టాస్క్ లు బాగా ఆడినా కూడా సిరి, జెస్సీల వల్ల తన ఎగ్స్ ని జీరో చేస్కోవాల్సి వచ్చింది. అంతకుముందు రాజా టాస్క్ లో కూడా క్వాయిన్స్ ని పోగొట్టుకున్నాడు. తర్వాత బొమ్మలని కూడా వదలుకోవాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు ఇండివెడ్యువల్ టాస్క్ కాబట్టి ఛాలెంజ్ లో నెగ్గి, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ లో కూడా గెలిచి కెప్టెన్ అయినట్లుగా సమాచారం.

ఇక షణ్ముక్ కెప్టెన్ అయిన తర్వాత రేషన్ మేనేజర్ గా అనీమాస్టర్ ని ఎంపిక చేసుకున్నాడట. ఎందుకంటే అనీమాస్టర్ కి కిచెన్ గురించి బాగా తెలుసని అంతకుముందు ఎపిసోడ్ లో సిరితో డిస్కస్ చేశాడు షణ్ముక్. నిజానికి షణ్ముక్ కెప్టెన్ అవ్వగానే జెస్సీ లేదా సిరి ఇద్దరిలో ఒకర్ని రేషన్ మేనేజర్ గా నియమిస్తాడని అనుకున్నారు హౌస్ మేట్స్. కానీ, షణ్ముక్ అనీమాస్టర్ ని తీస్కున్నాడని సమాచారం. ఇక 8వ వారం షణ్ముక్ కెప్టెన్ అవ్వడంతో షణ్ముక్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ విషయాన్ని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అదీ మేటర్.

[yop_poll id=”4″]

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus