బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ పెద్ద దుమారమే లేపింది. ముఖ్యంగా సన్నీ గిల్టీ బోర్డ్ వేస్కుని తిరుగుతుంటే దాని గురించే హౌస్ మేట్స్ మధ్యలో డిస్కషన్స్ అనేవి జరిగాయి. షణ్ముక్ ఎప్పటిలాగానే సిరితో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. నామినేషన్స్ కంటే ముందే ఈ డిస్కషన్ జరిగింది. జెస్సీ వెళ్లిపోయినపుడు అసలు నాకే ఏడుపు రాలేదు. వాళ్లకెలా వచ్చింది అంటూ షణ్ముక్ మరోసారి విమర్శలు చేశాడు. ఎందుకు డ్రామాలు అంటూ బ్యాక్ సైడ్ మళ్లీ మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అసలు వీళ్లు నిజంగానే ఏడ్చారా.
అప్పటికప్పుడు ఎలా వస్తాయిరా బాబు ఏడుపులు అంటూ మాట్లాడాడు. నిజానికి షణ్ముక్ ఇలా మాట్లాడటం అనేది కొత్తేమీకాదు. గతంలో కూడా చాలాసార్లు మాట్లాడాడు. అయితే, ఇక్కడే కాజల్ అండ్ మానస్ ఇద్దరినీ ఉద్దేశ్యించి జెస్సీ వేసిన బిక్ష వల్ల బతికిపోయారు అంటూ నోరుజారుడు షణ్ముక్. నిజానికి ఇక్కడ మానస్ కంటే కూడా కాజల్ ఓటింగ్ లో వీక్ గా ఉంటుందని తెలుసు అందుకే కాజల్ నే ఇప్పుడు డైరెక్ట్ గా అన్నట్లుగా అయ్యింది. జెస్సీ వేసిన బిక్ష వల్ల ఇప్పుడు సేఫ్ అయ్యారు అనే మాట కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.
నిజానికి జెస్సీతో ఫోన్ కాల్ లో మాట్లాడేటపుడు మాత్రం నువ్వు అందరికీ ఇన్సిపిరేషన్ అని, నువ్వు వెళ్లిపోతూ ఒకర్ని సేఫ్ చేసి వెళ్తున్నావ్ చూడు.. చాలా గ్రేట్ అని అన్నాడు. నాగార్జున కూడా ఈమాటని హైలెట్ చేశారు. అక్కడి వరకూ కథ బాగానే ఉంది, కానీ బిక్షం వేశాడు అంటూ వెనక్కి వచ్చి సిరితో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని అంటున్నారు అందరూ.మరోవైపు కాజల్ వెళ్లిపోతే ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి అని కూడా స్టేట్మెంట్ ఇస్తూ కాజల్ ని నామినేట్ చేశాడు షణ్ముక్.
ఈ రీజన్ తనకి నచ్చలేదంటూ తిరిగి కాజల్ షణ్ముక్ ని నామినేట్ చేసింది. ఇక్కడే కాజల్ నీది ఫేక్ ఎమోషన్ లాగా నాకు అనిపించింది అంటూ తన మనసులో మాటని బయట పెట్టాడు షణ్ముక్. నేను ఫేక్ ఎమోషన్ కాదని, నాకు ఏది అనిపిస్తే అలాగే రియాక్ట్ అవుతానని తెగేసి చెప్పింది కాజల్. ఇద్దరికీ జరిగిన ఆర్గ్యూమెంట్ లో ఇప్పుడు కాజల్ ని సపోర్ట్ చేస్తున్నారూ కొందరు నెటిజన్స్. ఈవీడియోని వైరల్ చేస్తున్నారు. కాజల్ ఫ్యాన్ గ్రూప్స్ లో కూడా ఈవీడియో హల్ చల్ చేస్తోంది. అదీ మేటర్.