టిపికల్ రోల్ లో శర్వానంద్!

  • October 9, 2017 / 10:24 AM IST

“మహానుభావుడు” సూపర్ సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న శర్వానంద్ త్వరలోనే తన తాజా సినిమాకి శ్రీకారం చుట్టనున్నాడు. “స్వామిరారా, దోచేయ్, కేశవ” చిత్రాలతో రెగ్యులర్ కంటెంట్ తో కాక కాస్త డిఫరెంట్ ఫిలిమ్ మేకర్ గా పేరు తెచ్చుకొన్న సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. అయితే.. సుధీర్ వర్మ ఎప్పట్లానే ఈ తాజా చిత్రం కోసం కూడా ఒక టిపికల్ స్టోరీలైన్ రెడీ చేసుకొన్నాడట. శర్వానంద్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడట.

అయితే.. అదేమీ డ్యూయల్ రోల్ కాదు. ఒకే పాత్ర కానీ రెండు విభిన్నమైన షేడ్స్ అన్నమాట. ఈ రెండు పాత్రల్లో ఒక సగటు వ్యక్తిది కాదా మరో పాత్ర చాలా టిపికల్ గా ఉంటుందట. నిజానికి ఈ టిపికల్ క్యారెక్టరైజేషన్ నచ్చే శర్వానంద్ ఈ సినిమా ఒప్పుకొన్నాడట. వచ్చే నెలలో సెట్స్ కు వెళ్లనున్న ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఓ భారీ నిర్మాణ సంస్థలో ఓ అగ్ర దర్శకుడి కాంబినేషన్ లో శర్వానంద్ సినిమా ఉండబోతోందని, ఆ సినిమా అనంతరం శర్వా అగ్ర కథానాయకుల జాబితాలో చేరడం ఖాయమని అతడి పి.ఆర్ టీం చెబుతోంది. మరి అంత క్రేజీ ప్రొజెక్ట్ ఏంటో చూద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus