మహేష్‌కు శిల్ప అత్త అనుకున్నాం… కాదట!

సినిమా అనగానే అందమైన హీరోయిన్లు సహజం… అందులోనూ త్రివిక్రమ్‌ సినిమా అనగానే ఆ హీరోయిన్లు ఇంకా అందంగా కనిపిస్తారు ఎందుకో? హీరోయిన్‌తోపాటు హీరోయిన్‌ తల్లి పాత్ర లేదంటే హీరో తల్లిపాత్ర కూడా ఆ రేంజ్‌ అందగత్తె అయి ఉంటుంది. దాని కోసం త్రివిక్రమ్‌ వెనుకటి తరం హీరోయిన్లను ఎంచుకుంటూ ఉంటారు. రీసెంట్‌ టైమ్స్‌లో త్రివిక్రమ్‌ అలాంటి సీనియర్‌ హీరోయిన్లను తీసుకొచ్చి తన ట్రేడ్ మార్క్‌ చూపించారు. ఈ క్రమంలో SSMB28లోనూ అదే పని చేయబోతున్నారు. ఆమె సాగరక్య శిల్పా శెట్టి అని తెలుస్తోంది.

శిల్పా శెట్టి పాత్ర ఇలా ఉండబోతోంది అంటూ గత రెండ్రోజులుగా టాలీవుడ్‌లో తెగ పుకార్లు వినిపిస్తున్నాయి. శిల్ప కోసం త్రివిక్రమ్‌ అద్భుతమైన పాత్రను రాసుకున్నారట. ఈ సినిమాలో మహేష్‌కు పిన్నిగా శిల్ప శెట్టి కనిపించబోతోందట. అంటే ఈ సినిమా పిన్ని, కొడుకు మధ్య జరిగే కథ అని అర్థం చేసుకోవచ్చు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ ఇంట్రెస్టింగ్ అండ్‌ హిలేరియస్‌గా ఉంటాయంటున్నారు. శిల్ప కామెడీ టైమింగ్‌ చాలా బాగుంటుంది. దానినే ఇప్పుడు సినిమా చూపిస్తారట.

సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 31న సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. మోషన్‌ పోస్టర్‌ రూపంలో సినిమా వివరాలు ఇవ్వడానికి హారిక హాసిని టీమ్‌ సిద్ధమవుతోందట. ఆ రోజు చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ముహూర్తపు షాట్‌ కష్టమే. కాబట్టి అప్‌డేట్‌తో ఆ రోజును సెలబ్రేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది అభిమానులు. ఇవి కాకుండా ‘సర్కారు వారి పాట’ అప్‌డేట్‌ ఎలానూ ఉంటుంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus