Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

ఒక సినిమా విజయం టాలీవుడ్‌లో జనాల మైండ్‌సెట్‌లో ఎంతటి మార్పులు తీసుకొస్తుంది అనేది మీకు తెలియాలా? అయితే శివ నిర్వాణను చూడండి మీకే అర్థమైపోతుంది. అలాగే పొగుడుతున్నట్లు ఒక మాట అని.. దాంతోపాటే ఓ సెటైర్‌ ఎలా వేయాలి అనేది తెలియాలంటే ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అదే డైరక్టర్‌ శివ నిర్వాణ (Shiva Nirvana) స్పీచ్‌ వినండి అర్థమైపోతుంది. ఇదంతా జరిగింది ‘ఎపిక్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో. ఇటీవల ఈ కార్యక్రమం జరిగింది.

Shiva Nirvana, Vaishnavi Chaitanya

గత కొన్ని నెలలుగా ఏ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో, సక్సెస్‌ మీట్‌లో.. ఇలా ఏ కార్యక్రమంలో కూడా కనిపించని దర్శకుడు శివ నిర్వాణ ‘ఎపిక్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కనిపించారు. గత కొన్ని నెలలుగా ఆయన బిజీగా ఉన్నారో.. లేక ఎవరూ పిలవలేదో కానీ ఇప్పుడు అయితే వచ్చారు. ఆ విషయం పక్కన పెడితే.. ఆయన ఇదే వేదిక మీద ఓ కామెంట్‌ చేశారు. వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నటిగా ఎంతో ఎదిగిందని చెప్పిన శివ నిర్వాణ.. గతంలో ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన విషయాన్ని ప్రస్తావించారు.

తాను తెరకెక్కించిన ‘టక్ జగదీష్’ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాలో ఓ సీన్‌లో రౌడీ వచ్చి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నడుము గిల్లాలి. ఆ సీన్‌ చెబితే అప్పుడు వైష్ణవి వద్దని చెప్పిందట. ఆ సన్నివేశంలో వైష్ణవి ఇబ్బంది పడిందని చెప్పారు. అలాంటి వైష్ణవిని ‘బేబీ’ సినిమాలో చూసి ఆమె కన్విక్షన్‌కి ఆశ్చర్యపోయా అని చెప్పారు. ‘బేబీ’ సినిమా కాంబో ఇంత వేగంగా రిపీట్‌ అవ్వడం కూడా ఆనందంగా ఉందని చెప్పారాయన.

ఈ మాటల్లో దెప్పి పొడవడం ఏంటి అనే ప్రశ్న రావొచ్చు. ఎందుకంటే ‘టక్‌ జగదీశ్‌’ సినిమాకు ‘బేబీ’ సినిమాకు గ్యాప్‌ రెండేళ్లలోనే. ఈ రెండేళ్లలోనే ఆమె ఆలోచనలో ఈ మార్పులు రావడం పెద్ద విషయమే. అందుకే శివ నిర్వాణ (Shiva Nirvana) ఇలా అన్నారు అనిపిస్తోంది. లేదంటే మెచ్చుకుంటూ కూడా అని ఉండొచ్చు.

రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus