Balakrishna: ‘వీరసింహా’ అప్పుడు కాదన్నారు.. ఇప్పుడు అవునంటున్నారు.. ఏది నిజం?

  • February 8, 2023 / 12:48 PM IST

‘వీర సింహా రెడ్డి’ సినిమాకు సంబంధించి తొలుత లీక్‌ రూపంలో బయటకు వచ్చిన లీక్‌ గుర్తుందా? ఆ తర్వాత ఆ లుక్‌నే టీమ్‌ ఫస్ట్‌ లుక్‌ పేరుతో రిలీజ్‌ చేసింది కూడా. ఏదీ.. ఆ బ్లాక్‌ షర్ట్‌లో, డస్క్‌ బ్యాగ్రౌండ్‌లో కనిపించింది అదేనా అంటారా? అఁ.. అవును ఆ లుక్కే. దాని గురించి ఆ లుక్‌ వచ్చిన పుకార్లు, కామెంట్స్‌ కూడా మీకు గుర్తుండే ఉంటాయి. ఓ కన్నడ సినిమాలోని హీరో లుక్‌లా ఉంది?

ఆ సినిమానే తీయడం లేదు కదా? అంటూ పుకార్లు వినిపించాయి. ఇప్పుడు వాటికి దగ్గరగా బాలకృష్ణ కామెంట్‌ చేశారు. శివరాజ్‌ కుమార్‌ నటించిన ‘వేద’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్‌ చూస్తే.. ‘వీర సింహా రెడ్డి’లో సీనియర్‌ బాలకృష్ణ లుక్‌ వెనుక ఉన్న అసలు విషయం తెలిసింది. ‘‘శివ రాజ్‌కుమార్‌ నటించిన ‘మఫ్టీ’ సినిమా చూశాను.

ఆ సినిమాకు నాకు బాగా నచ్చింది. అందులో శివ చేసిన పాత్రను చూసే ‘వీర సింహా రెడ్డి’లో వీర సింహ పాత్రను తీర్చిదిద్దాం’’ అని చెప్పుకొచ్చారు బాలయ్య. దీంతో అప్పుడెప్పుడో వచ్చిన పుకార్లే కరెక్ట్‌ అని తేలిపోయింది. బ్లాక్‌ డ్రెస్‌లో బాలయ్య కూర్చున్న ఫొటో, నడుచుకుంటూ వస్తున్న ఫొటోలు లీక్‌ అయినప్పుడు చాలామంది ‘మఫ్టీ’ లుక్‌ అని చెప్పారు. అయితే అప్పుడు టీమ్‌ ఆ విషయాలను కొట్టిపారేసింది.

ఆ లుక్‌ వేరు, ఈ లుక్‌ వేరు అని చెప్పింది. కానీ ఇప్పుడు బాలయ్య మాత్రం ఆ సినిమాలో లుక్‌ను చూసే ఈ పాత్ర లుక్‌ను తీర్చిదిద్దాం అని చెప్పేశారు. అయితే ఏమైంది.. ఈ లుక్‌లో బాలయ్య అదిరిపోయాడు అనుకోండి. అవసరమైతే మరోసారి ఆ లుక్‌ మీద ఫుల్‌ లెంగ్త్‌ సినిమా తీసినా అదిరిపోతుంది అనేలా ఉన్నాడు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus