మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, జీవిత రాజశేఖర్..ల కుటుంబానికి మధ్య కోల్డ్ వార్ చాలా సార్లు జరిగింది. ఇది కొత్త న్యూస్ కాదు. గతంలో ఓ సందర్భంలో చిరంజీవి అభిమానులు రాజశేఖర్ ఫ్యామిలీ వస్తున్న కారు పై దాడి చేశారు. ఆ తర్వాత ‘ప్రజారాజ్యం’ టైంలో కూడా జీవితా రాజశేఖర్… లు, చిరు పై విమర్శల వర్షం కురిపించారు. ఇక 2019 లో ‘మా’ ఎన్నికల టైంలో జరిగిన రచ్చ.. అంతా ఇంతా కాదు. అయినప్పటికీ చిరు .. జీవితా రాజశేఖర్లు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆదుకుంటూనే ఉన్నారు.
అయినా వాళ్ళు.. చిరు పై విమర్శలు చేయడం ఆపలేదు. అవన్నీ పక్కన పెట్టేస్తే.. జీవితా రాజశేఖర్ ల పెద్దమ్మాయి శివాని ‘గీతా ఆర్ట్స్’ చిన బ్యానర్లో ఓ రూపొందిన ‘కోట బొమ్మాలి’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమెకు ఓ కఠినమైన ప్రశ్న ఎదురైంది. ‘చీటికీ మాటికీ.. మెగా ఫ్యామిలీ పై మీ తల్లిదండ్రులు మాటల యుద్దానికి దిగుతారు. మరి వాళ్ళ బ్యానర్లో సినిమా ఆఫర్ రావడం.. దానికి మీరు ఓకే చెప్పడం ఎలా అనిపిస్తుంది’.. అంటూ ఓ రిపోర్టర్ శివానీని ప్రశ్నించాడు.
దీనికి ఆమె కొంచెం ఘాటుగానే బదులిచ్చింది. (Shivani) శివానీ రాజశేఖర్ మాట్లాడుతూ… “లోపల బియ్యపు గింజ అంత జరిగితే బయటకు బిర్యానీ అంత కనిపిస్తుంది. నిజమే… చిరంజీవి- రాజశేఖర్..ల మధ్య కొన్ని వివాదాలు జరిగాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి. అవి అక్కడి వరకే..! కానీ అవసరం అయినప్పుడు అంతా కలిసిపోతారు. మేం అంతా ఒకే ఇండస్ట్రీలో ఉన్నాం కదా. ప్రొఫెషనల్ గా వేరు.. పర్సనల్ గా వేరు. చిరంజీవి గారి ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మధ్య మాటల యుద్ధం జరిగింది. కొంత డిస్ట్రబెన్స్ వచ్చింది.
కానీ ఆ వివాదాలు అన్నీ కూడా ఆ హీట్ మూమెంట్ లో ఉన్నప్పుడు జరిగాయి. ఆ గొడవల గురించి బయట వాళ్ళు ఎందుకు ఇంకా ఎక్కువగా గొడవ పడటం ? ఎందుకు ట్రోలింగ్ చేసుకోవడం ? గతంలో ఎప్పుడో చిన్న చిన్న వివాదాలు జరిగినంత మాత్రాన వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో నేను నటించకూడదా? అలా ఏమీ లేదు కదా. మా ప్రొడక్షన్ లో కూడా వాళ్ళు నటించొచ్చు. ‘గడ్డం గ్యాంగ్’ సినిమాలో నాగబాబు అంకుల్ నటించారు.ఎందుకంటే సినిమాల పరంగా వాళ్ళు కానీ మేము కానీ ప్రొఫెషనల్ గానే ఆలోచిస్తాం” అంటూ ఘాటుగా స్పందించింది.