Shivani: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన హీరో రాజశేఖర్?

  • November 16, 2023 / 02:43 PM IST

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే ఇప్పటికి కూడా ఈయన పలు సినిమాలలో నటించిన ఆ సినిమాల ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఇలా హీరోగా సక్సెస్ కాకపోవడంతో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో ఈయన నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇలా రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడం పట్ల తన కుమార్తె శివాని రాజశేఖర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈమె కూడా హీరోయిన్గా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శివాని రాజశేఖర్ కోటబొమ్మాలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా నవంబర్ 24వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నటువంటి ఈమె తన తండ్రి గురించి మాట్లాడారు. నాన్నకు ఎప్పటినుంచో అరవిందస్వామి జగపతిబాబు విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోల మాదిరిగా నెగిటివ్ పాత్రలలో నటించాలని చాలా కోరికగా ఉండేది ఎప్పటినుంచో ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఒక్కసారి కూడా అవకాశం రాలేదు.

ఇలాంటి నెగటివ్ పాత్రలలో నటించాలనే కోరికతో ఉన్నటువంటి నాన్నకు నితిన్ సినిమాలో పాత్ర తెలియగానే చాలా ఎక్సైట్ అయ్యి వెంటనే ఒప్పుకున్నారంటూ ఈ సందర్భంగా రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి గల కారణాన్ని శివాని (Shivani) చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus