సినిమాల్లో పాపులర్ అయిన తర్వాత… యువతలో క్రేజ్ వచ్చిన తర్వాత తమ బ్రాండ్ ని ప్రమోట్ చేయమని వాణిజ్య సంస్థలు హీరో, హీరోయిన్స్ ని సంప్రదిస్తుంటాయి. అందుకు భిన్నంగా అఖిల్ కి అవకాశాలు వచ్చాయి. అతను సినిమాలు రిలీజ్ కాకముందే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. సినిమా షూటింగ్స్ లో పాల్గొనకముందే వాణిజ్య ప్రకటనల్లో నటించారు. ఆ తర్వాత సినిమాలో నటించకముందే అవకాశం అందుకున్న తెలుగు స్టార్ గా రాజశేఖర్, జీవిత కూతురు శివానీ రాజశేఖర్ పేరు దక్కించుకుంది.
హిందీ హిట్ ‘టూ స్టేట్స్’ రీమేక్‌గా రూపొందుతోన్న తెలుగు సినిమాలో శివానీ హీరోయిన్ గా సంతకం చేసింది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా గతవారమే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్.. కనీసం ఫస్ట్ లుక్ కూడా రాకముందే శివానీకి బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశం రావడం విశేషం. అది కూడా సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, మహేశ్ బాబు, దీపికా పదుకొణే, ఆలియా భట్.. వంటి తారలు బ్రాండ్ అంబాసిడర్స్‌గా పనిచేసిన కోకోకోలా ఉత్పత్తులకు, శివానీ ప్రచారకర్తగా వ్యవహరించడాన్ని రాజశేఖర్, జీవిత దంపతులు గర్వంగా ఫీలవుతున్నారు.