Shivani Rajashekar: ఇంత‌క‌న్నా పిచ్చ కామెడీ ఉంటుందా అంటున్న నెటిజన్లు..!

యాంగ్రీ యంగ్ మేన్ హీరో రాజశేఖర్, జీవిత గురించి అందరికీ తెలిసిందే. తలంబ్రాలు, అంకుశం లాంటి సినిమాలలో జంటగా నటించారు. ముఖ్యంగా అంకుశం సినిమాతో రాజశేఖర్ కి యాంగ్రీ యంగ్ మేన్ అని కూడా పేరొచ్చింది. అయితే, ఒకసారి రాజశేఖర్ ఆసుపత్రిపాలైతే రాజశేఖర్ ఫ్యామిలీ కంటే జీవితే అన్నీ దగ్గరుండి చూసుకుంది. దాంతో రాజశేఖర్ నాకు ఈ అమ్మాయే భార్యగా కావాలని డిసైడయి విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి జీవితని పెళ్ళి చేసుకున్నాడు.

అప్పటినుంచి జీవిత రాజశేఖర్ గా ఇండస్ట్రీలో పిలువబడుతున్నారు. రాజశేఖర్ కి తెలుగు అంతగా రాదు. కాబట్టే ప్రతీదానికి జీవిత ముందుంటుంది. ఏది మాట్లాడలన్నా జీవిత ముందు రాజశేఖర్ కి చెప్తే ఆయన మాట్లాడతాడు. అంతగా రాజశేఖర్ జీవిత మీద ఆధారపడతాడు. ఇక జీవిత నటన మానేసినప్పటికీ సొంత నిర్మాణ సంస్థను స్థాపించి స్వీయ దర్శకత్వంలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. జీవిత దర్శకత్వం కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, ఇటీవల కాలంలో జీవిత రాజశేఖర్ దంపతులు తమ పిల్లలను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. కూతుళ్ళు శివాని, శివాత్మిక సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తూ బాగానే ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కోట బొమ్మాళి అనే సినిమా వచ్చింది. శ్రీకాంత్ హీరోగా నటించిన ఇందులో శివానీ హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా సక్సెస్ మీట్ లో శివానీ (Shivani Rajashekar) అమ్మ బయోపిక్ లో నటించాలని ఉందంటూ చెప్పడం పెద్ద కామెడీ అయిపోయింది. జీవిత హీరోయిన్‌గా 100 సినిమాలు చేసిందా..దర్శకురాలిగా ఎన్ని సినిమాలు చేసింది..అసలు ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus