Shobha Shetty: హాట్ టాపిక్ గా మారిన ‘కార్తీక దీపం’ విలన్ శోభా శెట్టి ఫోటోలు

‘కార్తీక దీపం’ సీరియల్ ను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఇదొక బుల్లితెర బాహుబలి అన్నట్టు అంతా చెబుతుంటారు. 2017 నుండీ 2023 ఫిబ్రవరి వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యింది అంటే.. ఇది ఎంత పెద్ద సక్సెస్ అయిన సీరియల్లో అర్ధం చేసుకోవచ్చు. ఈ సీరియల్ పై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ ట్రెండ్ అయ్యేవి. ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకి రాని రేటింగ్లు కూడా ఈ సీరియల్ కి వచ్చేవి.

కొత్త సినిమాలు టెలికాస్ట్ చేసినా ఈ సీరియల్ రేటింగ్ ఇంకా ఎక్కువగానే ఉండేది అంటే… ఇది ఎంత ప్రేక్షకాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. అయితే 6 ఏళ్ళ పాటు ఈ సీరియల్ కథ సాగడానికి ముఖ్య కారణం.. ఇందులో మౌనిత అనే విలన్ పాత్ర పోషించిన శోభా శెట్టి అని చెప్పాలి. ‘నరసింహ’ సినిమాకి నీలాంబరి (రమ్యకృష్ణ) పాత్ర ఎంత కీలకమో.. ఈ సీరియల్ కి మౌనిత పాత్ర అంత కీలకం. అయితే ఇంత పవర్ఫుల్ రోల్ పోషించిన ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.

‘బిగ్ బాస్ 7 ‘ కి కూడా హాజరవుతుంది అనే టాక్ వినిపించింది. ఆ విషయంలో క్లారిటీ లేదు. మరోపక్క సినిమాల్లో ఛాన్సులు వచ్చినట్టే వచ్చి.. చేజారిపోయినట్టు వినికిడి. ఆ విషయాలను పక్కన పెట్టేస్తే.. శోభా శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆమె (Shobha Shetty) సూట్ విప్పుతూ చేసిన గ్లామర్ షో హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus