మనం పెళ్ళిచేసుకుందాం, ఇది చట్టబద్దం కూడా!
- May 4, 2019 / 06:44 PM ISTByFilmy Focus
ప్రభాస్ హీరోగా వచ్చిన ‘పౌర్ణమి’ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు త్రిష, ఛార్మి లు. అప్పటినుండీ వీరిద్దరూ మంచి ఫ్రెండ్సయిపోయారు. వీరిద్దరూ ఎప్పుడూ కలిసినా గంటలు తరబడి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. లేట్ నైట్ పార్టీలకు కూడా హాజరవుతూ ఉంటారు. అందులోనూ ఇద్దరికీ పెళ్ళిళ్ళు కూడా కాలేదు. అయితే వీరిద్దరి అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే అవి సరదాగానే అయినా వీరి పై ట్రోల్స్ మాత్రం వస్తూనే ఉంటాయి.

- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఈరోజు త్రిష పుట్టిన రోజు. ఇదిలా ఉండగా..ఇప్పుడు ఛార్మి …త్రిష పై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. చార్మ్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ‘బేబీ నిన్ను ఎప్పుటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు నా ప్రపోజల్ ఎప్పుడు అంగీకరిస్తావా అని ఎదురుచూస్తున్నా. పెళ్ళి చేసేసుకుందాం! ఇప్పడు ఇది చట్టబద్ధం కూడా’ అంటూ ట్వీట్ చేసింది. గతంలో కూడా చార్మి ఇలాంటి ట్వీట్ చేసింది. అప్పుడు పెళ్ళికి నేను సిద్ధమే అంటూ త్రిష రిప్లై ఇచ్చింది కూడా. ఇది చూసిన నెటిజన్లు కొందరు.. ‘ఒక పెద్ద పొజిషన్లో ఉంది ఇలాంటి ట్వీట్లేంటి.. అయినా ఇదేం పాడు బుద్ది’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.












