జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న ఫైమా ప్రస్తుతం బిగ్ బాస్ షో సీజన్6 కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్6 లో టాస్క్ లలో కూడా అద్భుతంగా ప్రదర్శన ఇస్తూ ఫైమా ఆకట్టుకుంటున్నారు. పటాస్ షో ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా ఆ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఫైమా ఇండస్ట్రీలోకి పంపించకపోతే చస్తానని బెదిరించిందని సమాచారం.
నాకు నలుగురు ఆడపిల్లలు అని ఆ ఆడపిల్లలలో ఫైమా చిన్నది అని ఫైమా తల్లి చెప్పుకొచ్చారు. కూలి పని వేస్తూ జీవనం సాగించేదానినని తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదని ఆమె కామెంట్లు చేశారు. నూకలు, పురుగులు పడిన బియ్యం పెట్టి పిల్లల్ని పెంచానని ఆమె అన్నారు. ఫైమా చాలా మొండి అని ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టదని ఆమె కామెంట్లు చేశారు. కాలేజ్ లో చదివే సమయంలో ఫ్రెండ్స్ తో కలిసి ఫైమా పటాస్ షోకు వెళ్లిందని ఆ షోలో ఫైమా గట్టిగట్టిగా అరిచిందని ఆమె మాట్లాడిన విధానం,
వాయిస్ నచ్చి ఆ షోకు మళ్లీ ఆహ్వానించారని ఫైమా తల్లి పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావని అక్కడికి వెళ్లవద్దని సూచించామని ఆ తర్వాత పటాస్ షోకు పంపకపోతే చస్తా అని బెదిరించిందని ఫైమా తల్లి చెప్పుకొచ్చారు. బలవంతంగా ఫైమాను ఆ షోకు పంపించినా ఆ షో వల్ల మంచి పేరు వచ్చిందని ఫైమా తల్లి పేర్కొన్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల ద్వారా ఫైమాకు మంచి గుర్తింపు దక్కిందని ఆమె అన్నారు.
ప్రస్తుతం ఫైమా తల్లిగా ఎక్కడికి వెళ్లినా గుర్తింపు దక్కుతోందని ఆమె కామెంట్లు చేశారు. నా కూతురు కచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ గెలుస్తుందని నమ్మకం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఫైమా తల్లి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!