తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న తమన్నా ఒక సినిమా కోసం చిన్న హీరోయిన్ తీసుకునేంత రెమ్యూనరేషన్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘అభినేత్రి’. ఈ సినిమాలో తమన్నా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతోంది. అయితే ఈ సినిమా కోసం తమన్నా కేవలం ముప్పై లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుందని సమాచారం.
బాలీవుడ్ అవకాశాలను సైతం సంపాదించుకుంటున్న ఈ తరుణం తమ్ము బ్యూటీ ఇంత తక్కువ మొత్తాన్ని తీసుకోవడానికి ఓ కారణముంది. నిజానికి ఈ చిత్రం మూడు బాషల్లో తెరకెక్కుతోంది. సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే తమన్నాకు మూడు బాషల నుండి అవకాశాలు రావడం ఖాయం. అంతేకాదు తమన్నా తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి కూడా సిద్ధపడతారు. అదే ఆలోచనతో తమ్ము తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.