ఆ కామెంట్స్ ఎంతో అర్ధం కావట్లేదు : సమంత

  • March 29, 2019 / 05:24 PM IST

పెళ్ళైన తరువాత గ్లామర్ షో తగ్గించి కేవలం కథా బలం ఉన్న చిత్రాల్ని ఎంచుకుంటూ అందులోనూ తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ వస్తుంది. ఒక్క ‘సీమరాజా’ మినహాయిస్తే తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల సమంత నటించిన ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘యూ టర్న్’ ‘అభిమన్యుడు’ వంటి చిత్రాలలో సమంత నటనకి మంచి రెస్పాన్స్ రావడంతో పాటూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఆమె తాజాగా నటించిన ‘సూపర్ డీలక్స్’ చిత్రంలో తన పాత్రకి మాత్రం కొంత మిశ్రమ స్పందన వస్తుండడం చర్చనీయాంశం అయ్యింది.

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సూపర్ డీలక్స్’ చిత్రానికి అద్భుతమైన టాక్ వస్తుంది. ’10 ఏళ్ళకి ఒకసారైనా ఇలాంటి చిత్రం వస్తే బాగుణ్ణు’ అనేంతలా ఈ చిత్రం పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం. ఇక ఈ చిత్రంలో సమంత వ్యాంప్ క్యారెక్టర్ చేసింది. ఈ పాత్ర సమంత చాలా అద్భుతంగా చేసింది అని చాలా మంది ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. అంతే సమంత కెరీర్లోనే ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు. కానీ సమంత మాత్రం ‘వీటిని ప్రశంసల మాదిరిగా తీసుకోవాలో విమర్శలుగా తీసుకోవాలో అర్థం కావడం లేదు’ అంటూ కామెంట్ పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ‘అదేంటి అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సమంత ఇలాంటి కామెంట్ పెట్టిందేంటి’.. అనేగా మీ డౌట్. దీనికి ముఖ్య కారణం సమంత ‘డై హార్డ్ ఫ్యాన్స్’ కొంతమందికి.. సమంత ఇలా వ్యాంప్ క్యారెక్టర్ చేయడం నచ్చలేదంట అందుకే.. ‘పెళ్ళయ్యాక ఇలా వ్యాంప్ క్యారెక్టర్లు చేయడమేంటనీ’ వారు నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు. అందుకే సమంత అలా కామెంట్ చేసిందన్న మాట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus