కృతిశెట్టిలాగే ఆ హీరోయిన్ పని అయిపోయినట్టేనా..!

  • November 28, 2023 / 10:54 AM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ప్రతీ ఒక్కరు ముక్తకంఠం తో చెప్పే పేరు శ్రీలీల. చాలా కాలం తర్వాత ఒక తెలుగు అమ్మాయి దెబ్బకి అప్పటి వరకు ఇండస్ట్రీ లో కొనసాగుతున్న స్టార్ హీరోయిన్స్ అడ్రస్లు మొత్తం గల్లంతు అయ్యింది. కేవలం రెండు మూడు సినిమాలతోనే ఈ రేంజ్ కి వచ్చిందంటే సాధారణమైన విషయం కాదు. కానీ ఆ సినిమా సక్సెస్ తో వరుసగా 8నుంచి 10 సినిమాలు చేతిలో పెట్టుకుంది. ఇప్పుడు అవి వరుసగా రీలీజ్ అవుతున్నాయి.

కాకపోతే ఫలితాలు మాత్రం ఊహించని విధంగా వస్తున్నాయి. కథ కాకుండా కాంబినేషన్ పై ఫోకస్ పెడుతూ.. తప్పు చేస్తుందని విషయం ఆమె సినిమాల ఫలితాలను చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో ముందుగా స్కంద పేరు చెప్పుకోవాలి. రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన స్కంద ఎన్నో రకాలుగా ట్రోల్ అయింది కూడా. హ్యాట్రిక్ అందుకుందాం అనుకున్న శ్రీలీల ఆశలకు ఈ సినిమా గండి కొట్టింది.

దసరాకు విడుదలైన భగవంత్ కేసరితో ఫామ్ లోకి వచ్చినా.. ఇందులో శ్రీలీల హీరోయిన్ కాదు.. బాలయ్య కూతురు పాత్రలో నటించింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడం అనేది అందరూ హీరోయిన్లకు చేత కాదు.. వాళ్లు ఆ డేర్ కూడా చేయలేరు కానీ శ్రీలీల చేసింది. గతంలో హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చిన (Krithi Shetty) కృతి శెట్టి.

ఆ తర్వాత వరుసగా 5 ఫ్లాపులతో ఎవరికీ కనిపించకుండా పోయింది. ఇప్పుడు శ్రీలీల మరో కృతి శెట్టి కాకూడదు అంటే ఆదికేశవ ఒక్కటే ఆయుధం అనుకున్నారంతా. కానీ ఔట్ డేటెడ్ కథతో వచ్చిన ఆదికేశవ మూడు రోజులు కూడా ఆడేలా కనిపించడం లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది. ఆదికేశవ అంచనాలు తప్పడంతో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాలపైనే శ్రీలీల ఆశలున్నాయ్ ఇప్పుడు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus