Mahesh Babu, Rajamouli: మహేష్ మూవీ విషయంలో అలా జరుగుతోందా?

  • July 4, 2022 / 12:08 PM IST

మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించి ఇప్పటివరకు కథ కూడా ఫైనల్ కాలేదనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకాకముందే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు కేఎల్ నారాయణ నిర్మాత అనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నిర్మాణంలో బాహుబలి సినిమా నిర్మాతలకు భాగస్వామ్యం లభించనుందని తెలుస్తోంది.

బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సక్సెస్ కావడంలో నిర్మాతల కృషి ఎంతో ఉంది. ఈ నిర్మాతలు మహేష్ జక్కన్న కాంబో మూవీని కేఎల్ నారాయణతో కలిసి నిర్మిస్తే ఈ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు మహేష్ జక్కన్న కాంబో సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న కొన్ని వార్తలు సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచుతున్నాయి.

ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా రాజమౌళి విదేశాల్లోనే ఈ సినిమాను షూట్ చేస్తారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. బాలీవుడ్ లేదా హాలీవుడ్ హీరోయిన్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో రెండేళ్ల పాటు ఈ సినిమా షూట్ జరగనుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మహేష్ బాబు చాలా సంవత్సరాల నుంచి రాజమౌళితో పని చేయాలని భావిస్తున్నా చాలా సంవత్సరాల తర్వాత ఈ కాంబోలో మూవీ సెట్ అయింది. మహేష్ బాబు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus