కొన్నాళ్ల పాటు తెలుగులో సినిమాలు చేసి ఇక్కడ సక్సెస్ లభించకపోవడంతో.. బాలీవుడ్ కి చెక్కేసింది తాప్సీ. బాలీవుడ్లో మాత్రం ఈమె బాగానే రాణిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అక్కడి జనాలను బాగా ఆకట్టుకుంది.అక్కడ ఈమె మినిమమ్ గ్యారెంటీ అనిపించే సినిమాలు చేస్తుంది. అందులో కొన్ని కొన్ని తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. ఈ మధ్యనే తెలుగులో కూడా ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే సినిమా చేసింది. ఇక ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘దొబారా’ చిత్రం ఆగస్టు 19న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా కెమెరామెన్లతో గొడవకి దిగింది తాప్సీ.
స్టార్ హీరోయిన్లు కెమెరామెన్ వంటి వారితో మాటల యుద్దానికి దిగితే.. వారు నోరు మూసుకుంటారు అనుకుందో ఏమో కానీ తాప్సీ..ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోయింది. వివరాల్లోకి వెళితే.. ముంబైలో ఓ ఇంటర్వ్యూ కోసం హాజరుకావాల్సిన తాప్సీ అప్పటికే చాలా ఆలస్యంగా వచ్చింది. ‘దొబారా’ సినిమా యూనిట్ ఆ ఇంటర్వ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. తాప్సీ లేటుగా వచ్చినప్పటికీ ఫోటోగ్రాఫర్లు ఫోటోలకు ఫోజులు ఇవ్వండి అని కోరారు. కానీ ఆమె పట్టించుకోకుండా లోపలికి వెళ్లబోయింది. దీంతో ఓ ఫోటోగ్రాఫర్ ‘మీకోసమే గంటల తరబడి వెయిట్ చేస్తున్నాం… అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి?’ అంటూ ప్రశ్నించాడు.
ఇందుకు తాప్సీకి కోపం వచ్చింది. ‘మర్యాదగా మాట్లాడండి… నేను నా పని చేస్తున్నాను. రావాల్సిన చోటుకి నాకు చెప్పిన టైం ప్రకారమే వస్తున్నాను. తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి… తాప్సి మాట్లాడుతుంటే అక్కడి కెమెరామెన్ లు కూడా ఆమెతో వాగ్వాదానికి దిగారు. అయినా ఆమె సమర్ధించుకునే ప్రయత్నం చేసి చివరికి వారికి దణ్ణం పెట్టి క్షమాపణలు కోరింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?